దుర్మార్గులు ఎక్కడ ఉన్నా.. అవకాశం వచ్చినప్పుడు వారి బుద్ధిని బయటపెడతారు. అలా ఓ టాటూ ఆర్టిస్ట్ ఇంతకాలం మేక వన్నె పులిలా చేసిన అరాచకాలు ఒక్కసారిగా బయటకు వచ్చాయి. టాటూ కోసం వచ్చిన ఓ అమ్మాయిని వెన్నుపూస మీద సూది పెట్టి అత్యాచారం చేశాడు. ఆ యువతి సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుతో అసలు విషయం వెలుగుచూసింది. ఆ పోస్టు ఆధారంగానే పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న తర్వాత అతని లిస్టు చూసి పోలీసులే ఆశ్చర్యపోయారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
వివరాల్లోకి వెళ్తే.. కోచికి చెందిన సుజీష్ అనే వ్యక్తి పదేళ్లుగా టాటూ స్టూడియో నిర్వహిస్తున్నాడు. అక్కడకు ఓ యువతి టాటూ కోసం వెళ్లింది. వెన్ను మీద టాటూ కాబట్టి రద్దీగా ఉన్న స్టూడియోలో కాస్త ప్రైవసీ కోరుకుంది. అదే తన తప్పు అయ్యిందని ఆ యువతి చెబుతోంది. అలా టాటూ వేసే సమయంలో ఎవరూ లేకపోవడాన్ని అదునుగా తీసుకుని ఆర్టిస్ట్ తనపై అత్యాచారం చేసినట్లు ఆ యువతి ఆరోపిస్తోంది. వెన్నుపై సూది పెట్టి తనపై బలాత్కారం చేసినట్లు తెలిపింది. ఆ క్షణంలోనే తాను చనిపోయిన భావన కలిగిందని చెప్పుకొచ్చింది.
ఆ విషయం మొత్తాన్ని బాధితురాలు మార్చి 2న సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ‘ఎవరూ లేరని అదునుగా తీసుకుని నన్ను అసభ్యంగా తాకాడు. నా వెన్నుపై సూది పెట్టి అత్యాచారం చేశాడు. అతనికి అంత ధైర్యం ఉంటుంది అనుకోలేదు. నేను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అక్కడే చనిపోవాలని పిచ్చింది. నాకు అసహ్యం కలిగింది’ అంటూ ఆ యువతి చేసిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పోలీసులు సుమోటోగా ఆ పోస్టు ఆధారంగా సుజీష్ పై కేసు నమోదు చేశారు. అతడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ఇదీ చదవండి: ఆమెకు ఇద్దరు.. ఒకే గదిలో ముగ్గురూ కలిసి మెలిసి కాపురం!
పోలీసులు కేసు నమోదు చేశారనే వార్త బయటకు రావడంతో ఆదివారం ఉదయం నుంచి సుజీష్ ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగు చూశాయి. తమను కొన్నేళ్లు లైంగింక వేధింపులకు గురిచేస్తున్నాడంటూ పలువురు యువతులు ఫిర్యాదులు చేశారు. అతనిపై మొత్తం 164 మంది పోలీసులను ఆశ్రయించారు. సుజీష్ పై మొత్తం 6 ఎఫ్‌ఐఆర్లు నమోదు చేశారు. నిందితుడు మొదట పరారైనా కూడా ఆ తర్వాత లొంగిపోయాడు. అతడిని విచారణ నిమిత్తం చేరనల్లూరు పీఎస్ కు తరలించారు.
అయితే అతని బంధువుల వాదన మరోలా ఉంది. సుజీష్ పై వస్తున్నవన్నీ ఆరోపణలేనని కొట్టిపారేస్తున్నారు. అతను అందరి ముందే టాటూలు వేస్తాడని.. లైంగిక ఆరోపణల్లో నిజం లేదంటున్నారు. పోలీసులు మాత్రం అతడిని అరెస్టు చేసి విచారణ ప్రారంభించారు. ఫిర్యాదుదారుల నుంచి వివరాలు, సాక్షాధారాల సేకరణ ప్రారంభించారు. దాదాపు పదేళ్లుగా సుజీష్ టాటూ స్టూడియో నడుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. అతనికి టాటూ వేయడంలో మంచి గుర్తింపు కూడా ఉందని చెప్పుకొచ్చారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.