అక్రమ సంబంధం.. వివాహేతర సంబంధం.. ప్రస్తుతం బాగా ట్రెండింగ్ లో ఉన్న మాటలు ఇవి. ఎక్కడ చూసినా ఏదొక అనైతిక బంధం వెలుగుచూస్తూనే ఉంది. ఉంచుకున్న వ్యక్తి కోసం కట్టుకున్న వాళ్లను కడతేర్చడం లేదా వారిని ఎలాగోలా వదిలించుకోవడం చేస్తున్నారు. అందుకు అవసరమైతే హత్యలు చేయడానికి కూడా వెనుకాడటం లేదు. అలాంటి ఎంతో మందిని, ఎన్నో సంబంధాలను చూశాం. ప్రస్తుతం చెప్పుకోబోయే కిలేడీ గురించి వింటే మీకు ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఎందుకంటే మొగుడిని వదిలించుకోవడానికి ఆమె వేసిన మాస్టర్ ప్లాన్ ఆ రేజ్ లో ఉంటుంది. మొదట ప్రియుడితో కలిసి భర్తను మట్టుపెట్టాలని చూసింది. కానీ, పోలీసులకు దొరికిపోతామనే భయంతో భర్తను డ్రగ్స్ కేసులో ఇరికించాలనుకుంది. కానీ, ఆ పథకం కూడా బెడిసికొట్టింది.
వివరాల్లోకి వెళితే.. కేరళ రాష్ట్రం ఇడుక్కిలో సునీల్- సౌమ్య దంపతులు నివాసముంటున్నారు. సౌమ్యకు ఒక ఏడాది క్రితం వినోద్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత అది కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరూ ప్రేమించుకోవడం మొదలు పెట్టారు. ఆ తర్వాత ఆ ప్రేమ కాస్తా శారీరక సుఖాల దాకా వెళ్లింది. అలాగే తరచూ వారి కోరికలు తీర్చుకుంటున్నారు. కానీ, కొన్నాళ్లకు భర్తను వదిలించుకుని వినోద్ ఉండిపోవాలని సౌమ్య భావించింది. అందుకు ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయాలని అనుకుంది. కానీ, అలా చేస్తే వారు దొరికిపోతారనే భయం వచ్చింది.
అందుకని ఆ ప్లాన్ ను విరమించుకున్నారు. భర్తను డ్రగ్స్ కేసులో ఇరికించాలని సౌమ్య భావించింది. ప్రియుడితో ఆ విషయం చెప్పగానే అందుకు అతడు కూడా సరే అన్నాడు. ఆ తర్వాత వినోద్ 18 వేల రూపాయల విలువైన డ్రగ్స్ కొనుగోలు చేశాడు. వాటిని సౌమ్యకు అందజేశాడు. ఆ తర్వాత వినోద్ విదేశాలకు వెళ్లిపోయాడు. వినోద్ చెప్పినట్లుగానే డ్రగ్స్ ను సునీల్ ద్విచక్రవాహనంలో పెట్టింది. వాటిని ఫొటో తీసి వినోద్ కు పంపింది. అవి చూసి ఆ సమాచారం పోలీసులకు అందజేశాడు. వినోద్ ఇచ్చిన సమాచారంతోనే పోలీసులు సునీల్ ను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత సునీల్ డ్రగ్స్ వినియోగిస్తాడా? లేక విక్రయిస్తాడా అనే కోణంలో దర్యాప్తు చేశారు.
ఆ తర్వాత కథ సౌమ్య వద్దకు చేరుకుంది. ఆ తర్వాత అనుమానితుల జాబితాలో భార్య పేరు చేర్చారు. ఆమెను విచారణ చేయడం మొదలు పెట్టారు. ఆమె రెండుసార్లు భిన్నమైన వాంగ్మూలాలు ఇవ్వడంతో అనుమానం మరింత పెరిగింది. విచారణలో వినోద్ పాత్ర కూడా బయటపడింది. వాంగ్మూలం కోసమని పిలిచి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. వినోద్ ను కూడా విదేశాల నుంచి రప్పించి అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. భర్తను ఇరికించాలని చూసి చివరకు వాళ్లే ఇరుక్కుపోయారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.