ఈ మద్య సోషల్ మీడియా పుణ్యమా అని పలు వీడియోలు వైరల్ అవుతున్నాయి. కొన్ని సంఘటనలు చూస్తుంటే.. నిజ జీవితంలో ఇలా కూడా జరుగుతుందా అన్న ఆశ్చర్యం కలిగించేలా వీడియోలు ఉంటున్నాయి. నిన్నటి దాకా సాధారణంగా ఉన్న వ్యక్తులు కూడా సోషల్ మీడియా పుణ్యమా అని రాత్రికి రాత్రి పెద్ద స్టార్లు అయిపోతుంటారు. కేరళలో ఓ కాప్ ప్రదర్శించిన ధైర్య సాహసాలకు సంబంధించిన ఓ వీడియో తెగ వైరల్ అవుతుంది.
వీడియోలో చూపిస్తున్నట్లుగా ఓ ఎస్సైపై దుండగుడు కత్తితో అకస్మాత్తుగా దాడి చేశాడు. కత్తి దాడిలో గాయపడినప్పటికీ ఎస్సై ఏమాత్రం వెనక్కి తగ్గకుండా, అతన్ని పట్టుకోగలిగారు. ఎస్సై చూపించిన తెగువను మెచ్చుకుంటూ తెలంగాణ సీనియర్ ఐపీఎస్ అధికారి స్వాతి లక్రా ఈ వీడియో ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఇప్పుడా వీడియో వైరల్ గా మారింది. కత్తితో దాడికి యత్నించిన దుండగుడితో పోరాడిన పోలీస్ అధికారిపై ప్రశంసల జల్లు కరుస్తోంది వివరాల్లోకి వెళితే..
అళప్పుళ జిల్లా నూరనాడ్ పోలీస్ స్టేషన్‌లో అరుణ్ కుమార్ ఎస్సైగా పనిచేస్తున్నారు. పారా జంక్షన్ వద్ద ఎస్సై తన సిబ్బందితో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. అదే సమయంలో పక్క నుంచి స్కూటీ పై వెళ్తున్న ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. అంతే కాదు పోలీసు జీపు చూసి కాస్త ముందుకు పోనిచ్చాడు. ఆ వ్యక్తిపై అనుమానం రావడంతో.. జీపు నుంచి దిగి ఎస్సై అతని దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేశాడు. ఎస్ఐని గమనించిన అగంతకుడు తన దగ్గర ఉన్న కత్తిని తీసి దాడి చేశాడు.
దుండగుడు కత్తితో దాడి చేసినప్పటికీ ఏ మాత్రం భయపడకుండా ఎస్సై అతనిని పట్టుకున్నాడు. ఈ క్రమంలో ఇద్దరు పెనుగులాడటంతో కిందపడ్డారు. ఆ సమయంలో ఎస్సై చేతికి గాయం అయ్యింది. వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించగా ఏడు కుట్లు పడ్డాయి. దంతా అక్కడ సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు పోలీస్ అధికారిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. రియల్ హీరోలు ఇలాగే ఉంటారంటూ కొనియాడారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
How a real #hero looks like…👨🏽✈️💪🏽
Kudos to this Sub Inspector of Police from Kerala@TheKeralaPolice pic.twitter.com/UZfX5Wya7J
— Swati Lakra (@SwatiLakra_IPS) June 19, 2022