ప్రేమ గుడ్డిది మాత్రమే కాదు.. పిచ్చిది, వెర్రిది అని ఈ ఘటన గురించి తెలుసుకున్నాక మీరే ఒప్పుకుంటారు. ఎందుకంటే ప్రేమ పేరుతో ఈ యువతి ప్రవర్తించిన తీరు అందరినీ ముక్కున వేలేసుకునేలా చేస్తోంది. తమ ఇంట్లో పనిచేసే డ్రైవర్ తో ప్రేమలో పడటం చాలా సినిమాల్లో చూసుంటారు. నిజ జీవితంలో కూడా అలాంటి ఘటనలు వెలుగు చూసిన సందర్భాలు ఉన్నాయి. కానీ, ఇక్కడ మాత్రం ఆ డ్రైవర్ కు పెళ్లై, ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా నాకు వాడే కావాలంటూ ఆ యువతి పెళ్లాడింది. అందుకు ఒప్పుకోలేదని తల్లిదండ్రులను ఎదిరించింది. ప్రాణహాని ఉందంటూ వారిపై కేసు కూడా పెట్టింది. పైగా అక్క, పిల్లలతో నేను అన్యోన్యంగా ఉంటానంటూ స్టేట్ మెంట్ కూడా పాస్ చేసింది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
వివరాల్లోకి వెళ్తే.. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రం విజయపుర జిల్లా జాలగేరి గ్రామంలో చోటుచేసుకుంది. సోమలింగ అనే వ్యక్తి విజయపురలో నివసిస్తున్న ఓ కుటుంబానికి డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. వారి కుమార్తెను రోజూ కారులో కాలేజీ వద్ద దింపుతుంటాడు. కారు లేనిపక్షంలో బైక్ పై కూడా వదిలొస్తుంటాడు. తరచూ ఆమెను కాలేజీ వద్ద దింపే క్రమంలో ఆమెతో బాగా చనువు పెంచుకున్నాడు. దానిని అవకాశంగా మార్చుకుని ప్రేమ పేరుతో యువతిని తన మాయలో వేసుకున్నాడు. ఎంతలా అంటే అతని కోసం సొంత తల్లిదండ్రులను కూడా ఎదిరించేలా చేశాడు.
తల్లిదండ్రులకు వారి ప్రేమవ్యవహారం తెలియడంతో పెళ్లి చేసుకునేందుకు నిర్ణయించుకున్నారు. అమ్మాయి మేజర్ కావడంతో అతడిని గుడిలో పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ కార్యాలయంలో పేర్లు కూడా నమోదు చేసుకున్నారు. ఇక్కడ ట్విస్ట్ ఎంటంటే సోమలింగకు గతంలో వివాహం జరిగింది. అతడికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఆ విషయం తెలిసే తల్లిదండ్రులు వారి ప్రేమను తిరస్కరించారు. కుమార్తె చేసిన పనికి ఏం చేయాలో పాలుపోక పోలీసులను ఆశ్రయించారు. సోమలింగపై ఫిర్యాదు చేశారు. గతంలో వివాహం జరిగి తమ కుమార్తెను మోసం చేసి పెళ్లాడాడంటూ ఫిర్యాదు చేశారు.
ఇది కూడా చదవండి: కన్న తండ్రిపై కొడుకుల దారుణం! కత్తులతో పొడిచి!
అయితే తల్లిదండ్రులకు వారి కుమార్తె ఊహించని షాకిచ్చింది. తల్లిదండ్రుల నుంచి తమకు ప్రాణహాని ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తను మేజర్ అని.. తన ఇష్టప్రకారమే ఈ వివాహం జరిగిందని ఆమె తెలిపింది. పైగా సోమలింగానికి ముందే వివాహం జరిగిందని తనకు తెలుసునని.. తను ఏ విషయం దాచిపెట్టలేదని చెప్పింది. పైగా తామంతా కలిసి అన్యోన్యంగా జీవిస్తామంటూ యువతి కామెంట్ చేసింది. ఈ వార్త తెలుసుకున్న స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు. వివాహం జరిగి ఇద్దరు పిల్లలున్న వ్యక్తిని ప్రేమించి పెళ్లాడటం ఏంటని షాకవుతున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.