హత్యలు, మారణహోమాలు ఏదొకచోట కొనసాగుతూనే ఉన్నాయి. పాతకక్షలే కాదు.. కొందరు దొంగలు కూడా ఇప్పుడు హత్యలు చేసేందుకు వెనకాడటం లేదు. అలా ఇంటి పెద్దలేని సమయంలో కొందరు దుండగులు ఓ ఇంటిపై దాడిచేశారు. ఓ మహిళ సహా నలుగురు చిన్నారులను హతమార్చారు. ఆ ఇల్లు మొత్తం రక్తపుమయం చేశారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటక రాష్ట్రం మండ్య జిల్లా శ్రీరంగ పట్టణంలో ఈ దుర్ఘటన జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. గంగారామ్- లక్ష్మి దంపతులు రోల్డ్ గోల్డ్ నగలు అమ్ముతూ- నగలు పాలిష్ చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వ్యాపారం మీద గంగారామ్ పొరుగూర్లకు వెళ్తుంటాడు. అలా శనివారం పనిమీద సొంతూరు ఏపీకి వెళ్లాడు. ఇంట్లో లక్ష్మీ ఆమె సంతానం ఉన్నారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కొందరు వారిపై దాడి చేశారు. నిద్రలో ఉన్న లక్ష్మి(26), ఆమె సంతానం రాజ్(12), గోవింద్(11), కోమల్(7), కునాల్(4)లను దారుణంగా హత్య చేశారు.
ఎంతకూ.. ఇంట్లోంచి బయటకు రాకపోతే.. పక్కింటివారు కిటికీలోంచి చూశారు. అప్పుడు ఈ ఘోరం వెలుగుచూసింది. వెంటనే పోలీసులకు సమాచరమిచ్చారు. బాధితులను కత్తులతో దాడి చేసి దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ వార్తతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సైతం భయభ్రాంతులకు గురయ్యారు. జిల్లా ఎస్పీ సహా పోలీసు అధికారులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. భర్తను కూడా విచారించనున్నారు. దొంగతనానికి వచ్చి ఈ దారుణానికి ఒడిగట్టారా? ఈ కుటుంబం హత్య వెనుక ఏదైనా కారణం ఉందా? విచారణలో తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: ముగ్గురు పిల్లలతో కాల్వలో దూకిన మహిళ