మనసులో కలిగిన ప్రతి భావం ప్రేమ కాకపోవచ్చు. అది కోరిక, వ్యామోహం కూడా కావచ్చు. తనకు కలిగింది స్వచ్ఛమైన ప్రేమ.. నా ప్రియుడిని ఎలాగైనా దక్కించుకోవాలనే తాపత్రయంలో ఓ మహిళ అతి కిరాతకంగా ఐదు హత్యలు చేసింది. తను ప్రేమించింది మరెవరినో కాదు.. తనకు వరుసకు చెల్లి అయ్యే యువతి మొగుడిని. తన కామవాంఛను ప్రేమగా భ్రమపడి అందుకు అడ్డుగా ఉన్న చెల్లిని తప్పించాలనుకుని భావించింది. తాను చేసిన హత్య చూశారని మరో నలుగురు పిల్లలను దారుణంగా నరికి చంపింది. ఏమీ తెలియనట్లు మరుసటిరోజు అంత్యక్రియల్లో పాల్గొని మొసలి కన్నీరు కార్చింది. చేసిన పాపం ఎక్కడికి పోతుంది.. పోలీసుల విచారణలో అసలు నిజాలు వెలుగు చూశాయి.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
ఈ నెల 6న మండ్య జిల్లా శ్రీరంగపట్టణం తాలూకా కేఆర్‌ఎస్ గ్రామంలో ఓ ఇంట్లో ఐదు హత్యలు జరిగాయి. మృతుల వివరాలు గంగారామ్ భార్య లక్ష్మి(27), ముగ్గురు పిల్లలు రాజ్(10), కోమల్(8), కునాల్(6), అన్న కుమారుడు గోవింద(13). అంతా అది దుండగుల చర్య అనుకున్నారు. దొంగతనం కోసం వచ్చి ఈ హత్యలు చేసినట్లుగా మొదట అంతా భావించారు. కానీ, అసలు విషయం తెలిసి అందరూ బిత్తరపోయారు. ఈ హత్యలు చేసింది మైసూరు తాలూకా బెలవెత్త గ్రామానికి చెందిన సునీల్ భార్య లక్ష్మిగా గుర్తించారు. ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. నిందితురాలు లక్ష్మి, మృతురాలు గంగారామ్ భార్య లక్ష్మి వరుసకు అక్కాచెల్లెళ్లు.
ఎప్పటినుంచో గంగారామ్ పై సునీల్ భార్యకు కన్ను ఉంది. ఎలాగైన గంగారామ్ ను దక్కించుకోవాలని లక్ష్మి చాలాసార్లు ప్రయత్నించింది. గంగారామ్ కు భార్య లక్ష్మి అంటే అమితమైన ఇష్టం, ప్రేమ. వారి మధ్య గొడవలు పెట్టాలని సునీల్ భార్య చాలాసార్లు ప్రయత్నించింది. కానీ, గంగారామ్ ఆమె మాయ మాటలు నమ్మలేదు. చాలాసార్లు ప్రయత్నించి విఫలమైన లక్ష్మి.. గంగారామ్ కోసం దారుణానికి ఒడిగట్టింది. గంగారామ్ ఊర్లో లేని సమయం చూసుకుని ఈ హత్యలు చేసింది. బెలవెత్త గ్రామంలో చికెన్ షాపు నుంచి కత్తి తెచ్చుకుని దగ్గర పెట్టుకుంది.
ఇదీ చదవండి: సెలూన్ సెంటర్ ముసుగులో వ్యభిచారం
ఫిబ్రవరి 6న లక్ష్మితో సునీల్ భార్య రాత్రి దాకా గొడవ పడింది. అందరూ నిద్రపోయాక తెల్లవారుజాము 3 గంటల సమయంలో లక్ష్మిని చికెన్ కత్తితో దారుణంగా నరికి చంపింది. మెలుకువ వచ్చి ఏడుస్తున్న నలుగురు పిల్లలను అతి కిరాతకంగా నరికి చంపేసింది. ఆ తర్వాత ఇంట్లో బట్టలు, వస్తువులు చెల్లాచెదురుగా పడేసి ఏదో దొంగతనం జరిగింది అనే భావన కలిగేలా చేసింది. కత్తి కడిగేసి చికెన్ షాపులో ఇచ్చేసింది. ఏమీ ఎరుగనట్లు తర్వాతి రోజు అంత్యక్రియల్లో పాల్గొని మొసలి కన్నీరు కారుస్తూ కన్నీటి వీడ్కోలు పలికింది.
ఇదీ చదవండి: సోదరుడితో కలిసి భార్యపై భర్త దారుణం! తల నరికి మరీ..
విచారణ చేపట్టిన పోలీసులకు లక్ష్మి వ్యవహారంపై అనుమానం కలిగి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల దర్యాప్తులో హత్యలు చేసింది తానేనని లక్ష్మి అంగీకరించింది. గంగారామ్ కోసమే తాను ఆ హత్యలు చేసినట్లు ఒప్పుకుంది. పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ఘటన జరిగిన వెంటనే దర్యాప్తు జరిపి కేసును ఛేదించారు. కట్టుకున్న భర్తను కాదని మరిదిపై కన్నేసింది. తుచ్యమైన సుఖంకోసం ఐదు నిండు ప్రాణాలను బలితీసుకుంది. చివరికి ఆమె సాధించింది ఏంటి? పచ్చని సంసారాన్ని బుగ్గిపాలు చేసుకుని కటకటాల పాలైంది. అటు కట్టుకున్న భర్త ఇటు ప్రేమించాను అనుకున్న గంగారామ్ ఇద్దరూ దక్కలేదు. ఆమెకు ఒరిగింది ఏమీ లేదు. హంతకురాలు అనే ముద్ర తప్ప. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.