సమాజంలో చీకటి బంధాలు నానాటికి పెరిగిపోతున్నాయి. పరాయి పురుషుడి మోజులోపడి పచ్చని సంసారాన్ని బుగ్గిపాలు చేసుకుంటున్న మహిళలు ఎందరో ఉన్నారు. ఆ జాబితాలో చేరిన శ్రుతి అనే యువతి కథ ఇది. ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ, ఆరేళ్ల తర్వాత బుద్ధి గడ్డితిని తప్పుడు పనికి తెర లేపింది. ప్రేమగా చూసుకునే భర్తకన్నా, కుటుంబం కన్నా ఐదు నిమిషాల సుఖమే ఎక్కువైంది. పడుపు సుఖం కోసం పరాయి మగాడి మోజులో పడింది. పచ్చని సంసారంలో చిచ్చు పెట్టుకుంది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్రిక్ చేయండి.
వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని హసన్ జిల్లా సకలేష్ పూర్ తాలూకాలో ఈ ఘటన జరిగింది. మద్దికెరె గ్రామ పరిధిలో సంతోష్(29) అనే యువకుడి మృతదేహం లభ్యమైంది. ఎప్పటిలాగానే ఉద్యోగానికి వెళ్లొస్తున్న సంతోష్ పై ఎవరో దాడిచేసి హత్య చేశారు. మృతదేహాన్ని రోడ్డుపై పడేసి వెళ్లిపోయారు. అయితే ఆ దారుణానికి ఒడిగట్టింది మరెవరో కాదు.. కట్టుకున్న పెళ్లామే. ఆ ఘటనను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు చాలానే కష్టపడ్డారు.
కొడగు జిల్లా సోమవపేటెకు చెందిన సంతోష్ అనే యువకుడు ఆరేళ్ల క్రితం శ్రుతి అనే యవతిని ప్రేమించాడు. పెద్దలను ఒప్పించి వివాహం కూడా చేసుకున్నాడు. ఆరేళ్లు ఎంతో సంతోషంగా గడిచిపోయాయి. ఆరేళ్లు గడిచాక శ్రుతిమించిన కోరికలతో శ్రుతి బుద్ధి తప్పుదోవ పట్టింది. కట్టుకున్న భర్తను కాదని పరాయి యువకుడి మోజులో పడింది. చంద్రశేఖర్ అనే యువకుడితో చీకటి బంధానికి తెర లేపింది. అతనికి తనువు కూడా అర్పించుకుంది. అక్కడితో ఆగక భర్తను కూడా నిర్లక్ష్యం చేయడం మొదలు పెట్టింది. ఎంతో ప్రేమగా చూసుకుంటున్న భర్తప్రేమ ఆమెకు రుచించలేదు. కేవలం పడక సుఖంకోసం కబుర్లు చెప్పే చంద్రశేఖర్ ఎక్కువయ్యాడు. చంద్రశేఖర్ ను విడిచి ఉండలేకపోయింది. అతనే సర్వస్వం కావాలని భావించింది. అందుకు అడ్డొస్తాడు కాబట్టి భర్తను అడ్డుతొలగించుకోవాలని భావించింది. అదే విషయాన్ని ప్రియుడుకి కూడా చెప్పింది. అందుకు సరేనన్న చంద్రశేఖర్.. తన మిత్రుడితో కలిసి సంతోష్ ను హతమార్చారు. ఆ హత్యను ప్రమాదంగా చిత్రీకరించేందుకు ఎంతో ప్రయత్నించారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్రిక్ చేయండి.
పోలీసులకు వచ్చిన అనుమానం అసలు విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. శ్రుతి ప్రవర్తనపై అనుమానంతో పోలీసులు విచారణ చేపట్టారు. పోలీసు స్టైల్ లో ఓసారి విచారణ చేయగానే అసలు విషయాలు బయటపడ్డాయి. ప్రేమించి పెళ్లాడిన శ్రుతి ఇలా చేయడాన్ని తల్లిదండ్రులు జీర్ణించుకోలేక పోయారు. ఎంతో ప్రేమగా చూసుకునే భర్తను ఇలా చేస్తావా అంటూ నిలదీశారు. ఆమెను కఠినంగా శిక్షించాలంటూ సంతోష్ పేరెంట్స్ డిమాండ్ చేశారు. చీకటి బంధంకోసం శ్రుతి తప్పిన ఈ శ్రుతిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.