సాధారణంగా మన కుటుంబ సభ్యులు ఎవరైన చనిపోతే ఎంతో బాధపడతాం. అలా రోజులు గడుస్తున్న కొద్ది మరిచిపోతున్న క్రమంలో అప్పడప్పుడు చనిపోయిన వ్యక్తులు కలలోకి రావడం సహజం. కానీ ఓ వ్యక్తి చనిపోయాడని బంధువులు, గ్రామస్తులు అంతా కలిసి అంత్యక్రియలు జరిపారు. కొంత కాలానికి అంతా మరిచిపోయి ఉంటున్న తరుణంలోనే అదే వ్యక్తి తిరిగి ఇంటికొచ్చాడు. దీంతో ఒక్కసారిగా కటుంబ సభ్యులంతా షాక్ కు గురయ్యారు.
ఏంటా అని ఆరా తీస్తే చనిపోయింది అతను కాదని, మరోక వ్యక్తి అని తేలింది. ఇక చనిపోయాడుకున్న తమ తండ్రి తిరిగి ఇంటికి రావడంతో కూతుళ్ల ఆనందానికి అవదులు లేకుండా పోయాయి. ఇలాంటి ఘటనే తాజాగా కర్ణాటకలో చోటు చేసుకుంది. ఇక పూర్తి కథలోకి వెళ్తే.. తుమకూరు జిల్లా చిక్కమగళూరులోని గ్రామంలో నాగరాజప్ప అనే వ్యక్తి వృద్ధుడు నివాసం ఉంటున్నాడు. అయితే ఇతను మద్యానికి అలవాటు పడి ఆనారోగ్యపాలయ్యాడు.
దీంతో అతని కుటుంబ సభ్యులు బెంగుళూరులోని కోరమంగళలోని ఆసుపత్రికి తరలించి అక్కడి నుంచి మరో ఆస్పత్రికి తరలించారు. దీంతో ఆ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నాగరాజప్ప అక్కడి నుండి తప్పిపోయాడు. కుటుంబ సభ్యులు కొన్నాళ్లు వేచి చూసిన ఫలితం లేకుండా పోయింది. అయితే కొన్ని రోజుల తర్వా ఆ ఆస్పత్రికి సెక్యూరిటీ గార్డ్ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి నాగరాజప్ప ఇక్కడ శవమై కనిపించాడని తెలిపాడు. దీంతో అయిన కుటుంబ సభ్యులు షాక్ కు గురై. కన్నీటి సంద్రంలో మునిగిపోయారు.
చనిపోయిన వ్యక్తి కనిపించకుండా పోయిన నాగరాజప్ప మాదరిగానే పోలికలు ఉండడంతో కుటుంబ సభ్యులు నిజమేనని భావించి అంత్యక్రియలు జరిపి తమ పొలంలో పాతిపెట్టారు. అలా కొన్ని రోజులు గడిచిన అనంతరం నాగరాజప్ప నవంబర్ 30, 2021న తిరిగి ఇంటికి వచ్చాడు. దీంతో ఆయనను చూసిన కుటుంబ సభ్యులు కూతుళ్లు షాక్ కు గురయ్యారు. చనిపోయాడనుకుని అంత్యక్రియలు కూడా జరిపామని ఆయనకు చెప్పారు. చనిపోయింది నేను కాదని, ఎవరో అని చెప్పడంతో అంతా సంతోషం వ్యక్తం చేశారు. చనిపోయాడనుకుని మరో వ్యక్తికి అంత్యక్రియలు చేసిన ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.