నేటి కాలంలోని యువత ప్రేమ పేరుతో అమ్మాయిలను లోబరుచుకుని శారీరక కోరికలే కాకుండా అంది వచ్చిన అన్ని అవకాశాలు లాక్కుంటూ యువతులను మోసం చేస్తున్నారు. ఇలాంటి ఘటనే కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది. విజయపుర జిల్లాలోని ముద్దేబిహాళలో యూనియన్ బ్యాంక్ లో మిస్మితా అనే యువతి బ్యాంక్ క్యాషియర్ విధులు నిర్వర్తిస్తోంది. ఆమె మంజునాథ్ అనే యువకుడి ప్రేమలో మునిగి తేలుతూ ఉంది. కొంత కాలం వీరి ప్రేమాయణం సాఫీగానే సాగింది.
అయితే తన ప్రియురాలు బ్యాంక్ క్యాషియర్ కావడంతో మెల్లగా ఆ బ్యాంక్ ఏటీఎం పాస్ వర్డ్ అడిగాడు. దీంతో ప్రియురాలు వద్దంటూ వెనకడుగు వేసింది. అలా కొంత కాలానికి ప్రియుడిపై ఉన్న నమ్మకంతో సరేనంటూ ఏటీఎం పాస్ వర్డ్ చెప్పింది. దీంతో మనోడు ఒక్కసారిగా రెచ్చిపోయాడు. ప్రియురాలికి తెలియకుండా తన స్నేహితులతో ఆ బ్యాంక్ ఏటీఎంను పగలగొట్టకుండా మంజునాథ్ ఏకంగా రూ.16 లక్షలు స్వాహా చేశారు. తదుపరి రోజే ఏటీఎంలో డబ్బులు కొల్లగొట్టారని బ్యాంక్ అధికారులు తెలిసి పోయింది.
దీంతో బ్యాంక్ అధికారులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో బ్యాంక్ లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. తర్వాత బ్యాంక్ లో పని చేస్తున్న ఉద్యోగుల ప్రమేయం మేరకు ఇదంతా జరిగిందని పోలీసులు నిగ్గుతేల్చారు. ఇక ఉద్యోగులతో విచారణ చేపట్టిన పోలీసులు క్యాషియర్ మేడమ్ ప్రవర్తనతో పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో గట్టిగా అడిగేసరికి అసలు మ్యాటర్ లీక్ చేసింది క్యాషియర్ మిస్మితా. దీంతో బెంబెలెత్తిపోయిన బ్యాంక్ అధికారులు ఆమెను ఉద్యోగం నుంచి తీసేయడమే కాకుండా నిందితులతో పాటు క్యాషియర్ మిస్మితా కూడా జైలు పాలు కావాల్సి వచ్చింది. ఇటీవల జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అయితే ప్రియుడే కదా అని నమ్మిన మిస్మితా అమాయకంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.