ఇటీవల కాలంలో వివాహేతర సంబంధాలలో తలదూర్చుతున్న కొందరు భార్యాభర్తలు నిండు సంసారాలు నాశనం చేసుకుంటున్నారు. పెళ్లై పిల్లలు ఉన్నా కూడా ఇలాంటి పాడుపనులకు సై అంటూ చివరికి కటకటాల్లోకి వెళ్లిపోతున్నారు. ఇలాంటి ఘటనే కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కర్నాటకలోని యాదగిరి జిల్లా సూరాపూర్ తాలూకాలో ఇది వరకే ఓ మహిళకు వివాహం అయింది. అయితే కొంత కాలం నుంచి ఈ మహిళకు చెల్లెలు మొగుడితో భర్తకు తెలియకుండా తెర వెనుక సంసారాన్ని కొనసాగిస్తోంది.
అలా కొంత కాలం వీరి చికటి సంసారం ఎంతో ఘనంగా సాగుతూ వస్తుంది. ఈ క్రమంలోనే అక్క భర్తకు భార్యపై అనుమానం రావడంతో భయపడిపోయింది. మరిది నుంచి వివాహేతర సంబంధం దక్కకుండా పోతుందేమోననని ఉరుకుల పరుగులతో ఆలోచనలకు పదును పెట్టింది. ఇక ఆ మహిళ అనుకున్నట్లుగానే వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న చెల్లెలి మొగుడి సాయంతో భర్తను చంపేందుకు ప్లాన్ వేసింది.
మరిది సాయంతో భర్తను చంపేందుకు ప్రయత్నాలు చేయడంతో ఎలాగో ఈ విషయం భర్తకు తెలిసింది. దీంతో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులిద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ప్రియుని మోజులో పడి కట్టుకున్న భర్తపై ఇంతటి దారుణానికి పాల్పడేందుకు ప్రయత్నం చేసిన ఈ వివాహిత తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.