ఇద్దరూ ప్రేమించుకున్నారు. కొంతకాలం కలిసి తిరిగారు, ఒకరినొకరు నచ్చుకోవడంతో వీరి ప్రేమ పెళ్లి వరకు వెళ్లింది. ఇక ఇరువురి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో ఎదురించి మరి వివాహం చేసుకున్నారు. కానీ జీవితాంతం ఆనందంగా, సంతోషంగా సాగుతుందనుకున్న ఈ జంటకు ఎక్కడో చెడింది. ఆ ఒక్కకారణమే ఒకరి మరణానికి దారితీసి జీవితంలో విషాదాన్ని నింపింది.
అసలు ఈ జంట ప్రేమ, పెళ్లి, విషాదం ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం. అది కర్ణాటకలోని మైసూరు నగరంలోని విజయనగర్ ప్రాంతం. ఇదే ప్రాంతానికి చెందిన అశ్విని (23), మైదనహళ్లికి చెందిన ప్రమోద్ కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ రోజుల నుంచి సంవత్సరాల వరకు పరుగులు తీసింది. దీంతో పీకల్లోతు ప్రేమలో ఉన్న ఈ జంట ఎలాగైన పెళ్లి చేసుకోవాలని కంకణం కట్టుకున్నారు. కానీ వీరి ప్రేమకు ఇరువురి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో ఒప్పించి మరీ గుడిలో పెళ్లి చేసుకున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండిఇక వీరికి అక్షింతలు వేసిన కూతురి తల్లిదండ్రులు కూడా చివరికి సంతోషపడ్డారు. ఇక పెళ్లై ఏడాది కావొచ్చింది. అశ్విని, ప్రమోద్ ల వైవాహిక జీవితం కొంతకాలం సాఫిగానే సాగింది. కొన్నాళ్లకి అశ్విని గర్భవతి కూడా అయ్యింది. ఈ తరుణంలోనే అప్పుడప్పుడు వీరిద్దరి మధ్య గొడవలు చెలరేగాయి. అశ్విని తల్లిదండ్రులు కూడా భార్యాభర్తల మధ్య గొడవలు సహజమే అనుకున్నారు. కానీ ఇటీవల అశ్విని భర్తతో పాటు కలిసి బైక్ పై షికారుకు వెళ్లి ఇంటికి రాత్రి అయినా రాకపోవడంతో అశ్విని తల్లిదండ్రులు అల్లుడికి, కూతురికి ఫోన్లు చేశారు. ఎటువంటి స్పందన రాలేదు. ఏం చేయాలో అర్థంకాక అటూ ఇటూ అంతా వెతికారు. ఎంత వెతికినా కూతురి, అల్లుడి జాడ కనిపించకపోవడంతో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ వేగవంతం చేశారు. పోలీసుల వెతుకులాటలో భాగంగా బిళికెరె చెరువులో అశ్విని మృతదేహం బయటపడింది. అల్లుడి జాడ దొరకకపోవడంతో అశ్విని తల్లిదండ్రులకు ప్రమోద్ పై అనుమానం బలపడింది. దీంతో అల్లుడే తమ కూతురిని హత్య చేసి ఉంటాడని అత్తమామలు ఆరోపిస్తూ కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ మేరకు అల్లుడిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఘటన తర్వాత కనిపించకుండా పోయిన ప్రమోద్ ను కనిపెట్టేందుకు పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.