అనుమానం పెనుభూతం అంటారు పెద్దలు.. భార్యాభర్తల మద్య ఏ చిన్న అనుమానం వచ్చినా.. అది చిలికి చిలికి గాలివానగా మారి విడిపోయే వరకు వస్తుంది. ఈ మద్య కాలంలో వివాహం జరిగిన సంవత్సరానికే దంపతుల మధ్య బేధాభిప్రాయాలు రావడంతో విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కుతున్నారు.
వేద మంత్రాల సాక్షిగా మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన దంపతులు ఒకరిపై ఒకరు నమ్మకంతో ఉంటూ.. నూరేళ్లూ చల్లగా జీవించాలని పెద్దలు ఆశీర్వదిస్తారు. ఈ మద్య వివాహబంధాల్లో అనేక అపశృతులు చోటు చేసుకుంటున్నాయి. పెళ్లైన సంవత్సరానికి కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. దీనికి ముఖ్య కారణం ఒకరిపై ఒకిరిక అనుమానాలు, వివాహేతర సంబంధాలు ఇలా ఎన్నో కారణాలతో పచ్చని సంసారాల్లో నిప్పులు పోసుకుంటున్నారు. అనుమానం పెనుభూతం అంటారు పెద్దలు. ఓ తండ్రి క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం.. 2 నెలల పసిబిడ్డ ప్రాణాలు తీసింది. ఈ ఘటన కాంచీపురంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
భార్యాభర్తలం ఇద్దరం నల్లగా ఉన్నాం.. తమకు పుట్టిన కొడుకు తెల్లగా ఎలా ఉంటాడు అన్న అనుమానంతో ఓ తండ్రి దారుణాలని పాల్పపడ్డాడు.. రెండు నెలల పసికందును గోడకేసి కొట్టి హతమార్చాడు. ఈ దారుణ ఘటన షోలింగనల్లూరు సమీపంలో చోటు చేసుకుంది. కాంచీ పురం జిల్లా విప్పేడు గ్రామానికి చెందిన రంజీత్ కుమార్, కౌసల్య భార్యాభర్తలు. కౌసల్య తమ సమీప బంధువు కావడంతో ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు రంజీత్ కుమార్. అయితే ప్రేమించుకునే సమయంలోనే కౌసల్య గర్భవతి అయ్యింది. రెండు నెలల క్రితం పండండి బాబు కి జన్మనిచ్చింది. షోలింగనల్లూరు లో తన తల్లిగారింటి వద్ద ఉన్న కౌసల్య, బాబుని చూడటానికి రంజీత్ వచ్చాడు.
బాబు ని చూసి రంజీత్ కుమార్ ఎంతో సంతోషిస్తాడని కౌసల్య ఆమె తల్లిదండ్రులు అనుకున్నారు.. కానీ సీన్ రివర్స్ అయ్యింది. తాను, తన భార్య కూడా నల్లగా ఉన్నామని.. అలాంటిది బాబు అంత తెల్లగా ఎలా ఉంటాడు అని కౌసల్య తల్లిదండ్రులతో గొడవకు దిగాడు. అంతేకాదు కౌసల్యపై అనుమానుం పెంచుకున్నాడు. మార్చి మొదటి వారం కౌసల్యను తన ఇంటికి తీసుకు వెళ్లాడు రంజీత్ కుమార్. అప్పటి నుంచి భార్యాభర్తల మద్య గొడవ జరుగుతూ వస్తుంది. భర్త అనుమానాలు భరించలేక కౌసల్య తన పుట్టింటికి వచ్చింది. ఈ క్రమంలో రంజీత్ కుమార్ అత్తగారింటికి వచ్చి ఉయ్యాల్లో ఉన్న చిన్నారిని తీసుకొని బలంగా గోడకేసి కొట్టాడు. తీవ్రంగా గాయపడిన బిడ్డను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు రంజీత్ కుమార్ పై కేసు నమోదుచేసి అరెస్ట్ చేశారు. చిన్నారి మరణంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.