ప్రత్యక్షంగా ఎన్నికైన కొందరు ప్రజా ప్రతినిధులు పరిపాలనను గాలికోదిలేసి బరితెగించి ప్రవర్తిస్తున్నారు. ఇంతటితో ఆగక సమస్యలను వివరించడానికి వచ్చిన కొందరి మహిళలను శారీరకంగా వేధిస్తూ దుర్మార్గులుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ నేత వనమా రాఘవ ఆకృత్యాలు బయటపడుతుంటే తాజాగా కామారెడ్డి జిల్లాలోని ఓ సర్పంచ్ వేధింపులు వెలుగు చూస్తున్నాయి. దీంతో సర్పంచ్ తీరుపై గ్రామస్తులు, మహిళలు తిరగబడుతున్నారు.
ఇది కూడా చదవండి: 13 ఏళ్ల చిన్నవాడితో రియల్ ఎస్టేట్ వ్యాపారి భార్య ఎఫైర్.. కట్ చేస్తే ఊహించని ఝలక్!
ఇక వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని నిజాంసాగర్ మండలం గాలిపూర్ గ్రామంలో లక్ష్మారెడ్డి అనే వ్యక్తి గ్రామ సర్పంచ్ గా విధులుగా నిర్వర్తిస్తున్నాడు. అయితే ఈ గ్రామంలో ఏదైన సమస్య ఉంటే అందరూ సర్పంచ్ వద్దకు వెళ్తూ ఉంటారు. అప్పుడప్పుడు మహిళలు కూడా సర్పంచ్ లక్ష్మారెడ్డి వద్దకు వస్తూ పోతుండడంతో లక్ష్మారెడ్డి కాస్త మహిళలపై కన్నేసి ఉంచాడు. అలా వచ్చిన కొందరి మహిళలను నా కోరిక తీర్చాలని, ఓ రోజు రాత్రి నాతో గడపాలంటూ వేధింపులకు గురి చేసేవాడు. ఇక రాను రాను సర్పంచ్ లక్ష్మారెడ్డి ఆగడాలు మితిమీరడంతో ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న గ్రామస్తులు, మహిళలు ఒక్కసారిగా సర్పంచ్ పై తిరగబడ్డారు.
ఇది కూడా చదవండి: పాల్వంచ ఫ్యామిలీ సూసైడ్ కేసు నిందితుడు వనమా రాఘవ అరెస్ట్
ఇంతటితో ఆగక గ్రామ వార్డ్ మెంబర్ల సాయంతో ఏకంగా స్థానిక పోలీసులకు సర్పంచ్ వేధింపుల గురించి ఫిర్యాదు చేశారు. గ్రామంలోని మహిళలను ప్రభుత్వ పథకాలు అందాలంటే ఖచ్చితంగా నా కోరిక తీర్చాలని వేధిస్తున్నాడని ఈ విషయంలో మాకు న్యాయం చేయాలంటూ కొందరు మహిళలు పోలీసు ముందు తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వేధింపులు సర్పంచ్ ఖాతాలో అనేకమున్నట్లు తెలుస్తోంది. అధికార దాహంతో పరిపాలనను గాలికొదిలేసి మహిళలను వేధిస్తున్న సర్పంచ్ లక్ష్మారెడ్డి తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.