తెలుగు రాష్ట్రాల్లో రైతు సంక్షేమం కోసం ఎన్నో నిధులు విడుదల చేస్తున్నామని.. రైతులకుఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా చేస్తామని ప్రభుత్వాలు హామీ ఇస్తున్నా.. ఎక్కడో అక్కడ రైతులు ఆర్థిక కష్టాలు భరించలేక ఆత్మహత్యలకు పాల్పపడుతున్న విషయం తెలిసిందే.
ఈ మద్య చాలా మంది చిన్న చిన్న విషయాలకే మనస్థాపానికి గురై క్షనికావేశంలో ప్రాణాలు తీసుకుంటున్నారు. దీంతో కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంటుంది. పని ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు ఇతర కారణాల వల్ల తీవ్ర మనస్థాపానికి గురై జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇటీవల ఆర్థిక కష్టాలతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. మరో ఎనిదిరోజుల్లో తన కూతురు పెళ్లి ఉండగా.. జీవితంపై విరక్తి చెంది రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన జయశంకర్-భూపాలపల్లి జిల్లా చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
ఓ వైపు ప్రభుత్వాలు రైతుకు ఎలాంటి కష్టం లేకుండా చూస్తున్నామని.. ఎన్నో పథకాలు అమలు చేస్తున్నామని చెప్పినా.. రైతు ఆత్మహత్యలు మాత్రం అరికట్టలేకపోతున్నాయి. ఆర్థిక కష్టాలతో ఎంతో మంది రైతులు జీవితాలపై విరక్తి చెంది బలవన్మరణాలకు పాల్పపడుతున్నారు. తాజాగా జయశంకర్-భూపాలపల్లి జిల్లా రామన్నగూడెం తండాకు చెందిన వీర్యానాయక్ (50) అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వీర్య నాయక్, శారద దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. గత కొంత కాలంగా గ్రామంలో ఉన్న 5 ఎకరాల్లో వీర్య నాయక్ వ్యవసాయం చేసుకుంటూ వస్తున్నారు.
ఐదేళ్లుగా వ్యవసాయానికి వీర్య నాయక్ సుమారు 13 లక్షలకు పైగా అప్పులు చేశారు. ఇటీవల పెద్ద కుమారుడు చందూలాల్ రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో కుటుంబ సభ్యులు ఒక్కసారే కృంగిపోయాడు. చేతికి ఎదిగిన కొడుకు చేదోడువాదోడుగా ఉంటాడనుకుంటే చనిపోయాడు.. అప్పటికే వీర్య నాయకు చిన్న కూతురు వివాహం నిశ్చయమైంది. ఈ నెల 31న పెళ్లి జరిపించేందుకు నిర్ణయించారు. ఓ వైపు కొడుకు మరణం.. మరోవైపు కూతురు పెళ్లికి ఎక్కడా అప్పు పుట్టకపోవడంతో ఏం చేయాలో అర్థం కాని వీర్య నాయక్ కి జీవితంపై విరక్తి చెంది సోమవారం పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పపడ్డాడు. కుటుంబ సభ్యులు గమనించి ఆసుపత్రికి తరలించగా చికిత్ర పొందతూ చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.