సమాజంలో ఎవరు ఎలా పోతే నాకెందుకు? నేను బాగున్నానా లేదా? నేను సేఫ్ గా ఉన్నానా? అనే ధోరణి ఎక్కువగా ఉంది. ఇంత గట్టిగా ఎందుకు అంటున్నామంటే.. ఈ ఆర్టికల్ చదివితే మీరు కూడా అదే నిజమని ఒప్పుకుంటారు. ఓ మనవడు తన 80 ఏళ్ల తాతను నడిరోడ్డుపై పడేసి ఇష్టమొచ్చినట్లు కొట్టి, ఈడ్చుకెళ్లి, బైక్ పై వేసుకుని వెళ్లిపోతే అక్కడి జనమంతా చోద్యం చూశారు. వారిలో ఏ ఒక్కరు కూడా అతడిని నిలువరించే ప్రయత్నం చేయలేదు. గ్రామస్థులు ఆ యువకుడికి మతిస్థిమితం లేదంటూ చెబుతున్నారు. అతను చేసిన వీరంగం మొత్తం అక్కడి సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది.
ఇదంతా మరెక్కడో కాదు.. తెలంగాణలోని జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం కల్వకోటలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. చందు(24)కి గత కొద్ది రోజులుగా మతిస్థిమితం ఉండటం లేదని గ్రామస్థులు చెబుతున్నారు. చందు తన తాత మల్లయ్య(80)ను రోడ్డు పడేసి ఇష్టమొచ్చినట్లు కొట్టాడు. ఎదిరించలేని ఆ వృద్ధుడు మనవడి చేతిలో చావు దెబ్బలు తిన్నాడు. చుట్టుపక్కల ఎంత మంది ఉన్నా కూడా చూస్తూ ఉండిపోయారే గానీ, ఆ యువకుడిని ఆపలేదు. ఇంకా రెచ్చిపోయి రాయి తీసుకుని తాతను కొట్టి చంపాడు. ఈడ్చుకెళ్లి బైక్ పై వేసుకుని వెళ్లిపోయాడు. ఆ దెబ్బలకు తాళలేక వృద్ధుడు మరణించాడు. చందుకు మతిస్థితిమితం ఉండటం లేదని చెబుతున్నా కూడా.. గతంలో అతను ఓ కేసులో జైలుకు కూడా వెళ్లొచ్చాడు. సీసీకెమెరాలో రికార్డు అయిన ఆ దృశ్యాలు అందరినీ కలచి వేస్తున్నాయి. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.