గుడిలేని దైవం అమ్మ.. కల్మషం లేని ప్రేమ అమ్మది.. కన్నపేగు కోసం ప్రాణాలను సైతం తుణప్రాయంగా త్యాగం చేసిన మాతృమూర్తులు ఎందరో. బిడ్డకు జన్మనివ్వడం అంటే ప్రతి తల్లికి అది పునర్జన్మ. తల్లి కన్నబిడ్డను కంటికిరెప్పలా కాపుడుకుటుంది. బిడ్డకు ఏ చిన్న కష్టం వచ్చినా తల్లి కళ్లు చెమ్మగిల్లుతాయి. కానీ, ఇప్పుడు చెప్పుకోబోయే మహాతల్లి మాత్రం అలాంటి మాతృత్వానికే మాయని మచ్చలాంటింది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్రిక్ చేయండి.
ఈ అత్యంత దారుణ, అమానుష ఘటన హైదరాబాద్ లోని మంగళ్ హాట్ పీఎస్ పరిధిలో జరిగింది. దత్తాత్రేయ కమాన్ వద్ద గుడిసెలో జీవనం సాగిస్తున్న లక్ష్మీ అనే మహిళ ఈ దారుణానికి ఒడిగట్టింది. మద్యం తాగొచ్చి నిద్రపోతున్న ఏడాది పాపను కొట్టి, గొంతు నులిమి హత్య చేసింది. ముక్కుపచ్చలారని ఆ చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని.. పాప మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆ మహిళను అదుపులోకి తీసుకున్నారు.
గతంలో ఈ పాప కిడ్నాప్ కు కూడా గురైంది. తర్వాత సురక్షితంగా తల్లి వద్దకు చేరుకుంది. కానీ, తాగిన మైకంలో ఆ తల్లే చిన్నారిని అత్యంత పాశవికంగా హత్య చేసింది. ఆ మహిళ చెత్తకాగితాలు ఏరుకుంటూ జీవనం సాగిస్తోంది. కావాలని ఇలా చేసిందా? మద్యం మత్తులో ఏం చేస్తోందో విచక్షణలేక ఇలా హత్య చేసిందా అనేది తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: తల్లిని పెళ్లాడి.. కుమార్తెతో రొమాన్స్