విద్యా బుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడే.. బుద్ధిలేని పని చేశాడు. కన్నబిడ్డలా చూసుకోవాల్సిన విద్యార్థినిని కాటేయాలను కున్నాడు. ఉదయాన్నే స్కూలుకు వచ్చిన బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె కేకలు వేయడంతో అక్కడి నుంచి జారుకున్నాడు. అసలు విషయం తెలిశాక అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
ఈ ఘటన మరెక్కడో కాదు హైదరాబాద్ లోని ఫలక్ నుమాలో ఈ దారుణం వెలుగు చూసింది. ఫలక్ నుమా ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న అష్వాక్ అహ్మద్ అనే ఉపాధ్యాయుడు ఉదయాన్నే స్కూల్ కు వచ్చాడు. అదే సమయంలో పాఠశాలకు వచ్చిన ఓ తొమ్మిదో తరగతి విద్యార్థినిని తరగతి గదిలోకి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు.
బాలిక కేకలు విని అక్కడున్న సిబ్బంది కొందరు ఆ కీచక మాస్టారి చెర నుంచి ఆ బాలికను రక్షించారు. జరిగిన విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. ఆ టీచర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ మాస్టారికి కొన్ని మానసిక సమస్యలు ఉన్నట్లు స్కూల్ యాజమాన్యం పోలీసులకు తెలిపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అసలు మానసిక సమస్యలున్న టీచర్ ను ఆ పాఠశాలకు ఎందుకు అనుమతిస్తున్నారు? అక్కడ సిబ్బంది గమనించకపోతే ఆ విద్యార్థిని జీవితం ఏం కావాలి? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేండి.
ఇదీ చదవండి: బయటేమో మసాజ్ సెంటర్. లోపల అమ్మాయిలతో..!