ఆస్పత్రిలో రోగులు, నర్సులతో మర్యాదగా మెలగాల్సిన కొందరు కేటుగాళ్లు బాధ్యత లేకండా బరితెగించి ప్రవర్తిస్తున్నారు. హైదరాబాద్ లోని ఓ హోమ్‌కేర్ సర్వీస్‌లో నర్సుగా పని చేస్తున్న మహిళపై సంస్థ నిర్వాహకుడు దారుణానికి పాల్పడ్డాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన తాజాగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
ఇక విషయం ఏంటంటే..? పంజాగుట్ట ద్వారకాపురి కాలనీలో హిల్ మై ఫ్యామిలీ హోమ్‌కేర్ సర్వీస్‌లో నర్సుగా పని చేస్తున్న మహిళకు 2012లో వివాహం జరిగింది. ఈమెకు ఓ కుమారుడు కూడా జన్మించాడు. అయితే కొన్ని కారణాల వల్ల భర్తతో విడాకులు తీసుకుని అతనికి దూరంగా కుమారుడితో పాటు ఉంటుంది. కాగా హిల్ మై ఫ్యామిలీ హోమ్‌కేర్ సర్వీస్ సంస్థ వ్యవస్థాపకుడు నాగోల్‌కు చెందిన మల్లెల సాయి ఈమెపై ఎప్పటి నుంచో కాస్త కన్నేసి ఉంచాడు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అయితే గత నెల 7న మల్లెల సాయి ఆమెకు ఫోన్ చేసి విజయవాడలోని ఓ పేషెంట్ కేర్ కు హాజరుకావాలని, వెంటనే ఆఫీస్ కు రావాలంటూ కబురు పంపాడు. నిజమేనని నమ్మిన ఆమె పరుగులు తీస్తూ ఆఫీసుకు చేరుకుంది. అక్కడికి చేరుకున్న ఆమెను సాయి భవనం పైన ఉన్న ఓ గదిలోకి తీసుకెళ్లాడు. అనంతరం గది తలుపులు వేసి ఆమెపై బలవంతంగా అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఈ విషయం ఎవరికి చెప్పొద్దని, చెబితే చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడి, వెంటనే ఆమెను ఎంజీబీఎస్ బస్టాండ్ లో విజయవాడ బస్సు ఎక్కించాడు.
ఇక కొన్ని రోజుల నుంచి ఆమె తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో సాయి చేసిన ఘోరాన్ని భరించలేక స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు సాయిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. నమ్మి వచ్చిన నర్సుపై సంస్థ నిర్వాహకుడు చేసిన ఇంతటి దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.