మారుతున్న కాలానికి అనుగుణంగా కాలంతో పాటు టెక్నాలజీలో కూడా అనేకమైన మార్పులు సంభవిస్తున్నాయి. అయితే ఈ పోటీ ప్రపంచంలో ఒక పక్క అభివృద్ధి చెందుతుంటే మరోపక్క బాగా చదువుకున్న యువకులు టెక్నాలజీని ఆసరాగా చేసుకుని సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే కొందరు యువకులు అశ్లీల వీడియోలను, యువతులకు పంపుతూ డబ్బులు డిమాండ్ చేస్తూ చివరికి కటకటాలపాలవుతున్నారు. కానీ కేరళలోని ఓ మతిస్థితిమితం లేని ఓ యువకుడు ఏకంగా మహిళా పోలీసు అధికారికే చుక్కలు చూపించాడు.
ఇక విషయం ఏంటంటే..? హైదరాబాద్ లోని రాష్ట్ర మహిళా భద్రత విభాగంలో ఓ మహిళ అసిస్టెంట్ సబ్–ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తోంది. అయితే గత కొన్ని రోజుల నుంచి ఆమె మోబైల్ కు తరుచు అశ్లీల వీడియోలు, ఫోటోలు వస్తున్నాయి. మొదట్లో శరమాములే అంటూ సైలెంట్ గా చూసి చూడనట్లుగా వదిలేసింది. అయితే రాను రాను ఈ వీడియోలు ఎక్కవవుతుండడంతో ఈ అధికారి సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి పోలీసులు నిందితుడుని పట్టుకునేందుకు అనేక ప్రయత్నాలు చేశారు.
చివరికి నిందితుడు కేరళలోని ఉన్నట్లు అధికారులు గుర్తించారు. తిరువనంతపురం సమీపంలోని ఓ గ్రామంతో నిందితుడి ఆచూకీ కనిపెట్టిన ప్రత్యేక బృందం అతడిని చూసి అంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఓ పూరి గుడిసెలో నివాసం ఉంటూ ఇంతటి దారుణానికి పాల్పడ్డడా అంటూ ఆశ్చర్యానికి లోనవుతున్నారు. ఇక వెంటనే నిందితుడి ఫోన్ లో చూడగా అనేకమైన అశ్లీల ఫోటోలు, వీడియోలు కుప్పలు తెప్పలుగా కనిపించాయి.
ఆ వీడియోలు పంపిన వ్యక్తిని ప్రశ్నించగా నాకు ఆమె మహిళా పోలీసు అధికారి అని తెలియదని, ఏదో ఒక నెంబర్ కు పంపిస్తున్నాను అనుకున్నానని తెలిపాడు. ఇలాంటి విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలని, లేకుంటే మరింత ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందని ప్రత్యేక పోలీసులు అతని కుటుంబ సభ్యలను హెచ్చరించారు. నిందితుడు మూగ, చేవిటి వాడు కావడంతో అరెస్ట్ చేయకుండా కౌన్స్ లింగ్ ఇచ్చి వదిలేశారు. తాజాగా తిరువనంతపురంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.