ఈ మద్య కొంత మంది యువత చిన్న చిన్న విషయాలకే ఎమోషన్ కి గురి అవుతున్నారు. ఆ సమయంలో విచక్షణ కోల్పోయి తాము ఏం చేస్తున్నాం అన్న విషయం మర్చిపోయి దారుణాలకు పాల్పపడుతున్నారు. ముఖ్యంగా ప్రేమ వ్యవహారాలు, అక్రమ సంబంధాల కారణాల వల్ల ఈ దారుణాలు జరుగుతున్నాయి.
ప్రేమ అనేది ఎప్పుడు ఎలా పుడుతుందో ఎవరూ చెప్పలేదు.. ఒక్కసారి ప్రేమలో పడితే దేన్నైనా ఎదిరించేందుకు సిద్దమవుతారు ప్రేమికులు. ప్రేమికులు తమ ప్రేమను పెద్దలకు చెప్పి వారి అంగీకారంతో పెళ్లి చేసుకుంటే.. మరికొన్ని జంటలు పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకుంటారు. కొంతమంది ప్రేమికులు విజయతీరాలకు చేరుకుంటే.. మరికొన్ని అర్ధాంతరంగా విషాదంలో మిగిలిపోతాయి. ప్రేమించిన అమ్మాయి, అబ్బాయి దక్కలేదని ఆత్మహత్యలే చేసుకున్నవాళ్లు కూడా ఉన్నారు. తాజాగా ఓ యువకుడు తాను ప్రేమించిన అమ్మాయి తనకు దక్కదేమో అని భయంతో తన స్నేహితుడిని దారుణంగా హత్యచేసిన ఘటన హైదరాబాద్ లో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
నల్లగొండ జిల్లాకు చెందిన నవీన్, హరిహర అనే ఇద్దరు మంచి స్నేహితులు. వీరు జిల్లాలోని మహాత్మాగాంధి యునివర్సిటీలో చదువుతున్నారు. అదే యూనివర్సిటలో మరో యువతి చదువుతుంది.. ఆమెతో ఇద్దరు స్నేహితులు చనువుగా మాట్లాడేవారు. అయితే ఇద్దరు స్నేహితులు ఆ యువతిని ప్రేమించడం మొదలు పెట్టారు. ఈ విషయంలోనే ఇద్దరికీ భేదాభిప్రాయాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే తన ప్రియురాలిని దక్కించుకునేందుకు హరిహర ఓ దారుణమైన కుట్ర పన్నాడు. తన ప్రేమకు అడ్డుగా ఉన్న నవీన్ ని అడ్డు తొలగించేందుకు స్కెచ్ వేశాడు. ఈ నెల 17వ తేదీన నవీన్‌ను పార్టీ చేసుకుందాం అని అబ్దుల్లాపూర్‌మెట్‌లో తన స్నేహితుడి రూమ్‌కు రమ్మని చెప్పాడు. అయితే హరిహర కన్నింగ్ ప్లాన్ తెలియని నవీన్ అతడి వద్దకు వెళ్లాడు. ఇద్దరూ పార్టీ చేసుకున్నారు.
ఫ్రెండ్ రూమ్ లో పార్టీ చేసుకుంటున్న నవీన్, హరిహర మద్య గొడవ మొదలైంది.. ఇద్దరు కొట్టుకునే వరకు వెళ్లారు. అదే సమయంలో నవీన్ తన తండ్రి శంకరయ్యకు ఫోన్ చేసి గొడవ గురించి చెప్పాడు. నవీన్ తండ్రి శంకరయ్య హరిహరతో మాట్లాడి గొడవలు పెట్టుకోవద్దు అన్నదమ్ముల్లా కలిసి ఉండండి అంటూ సర్ధి చెప్పాడు. అయితే తన కొడుకు నవీన్ గత నాలుగు రోజుల నుంచి కాలేజ్ రావడం లేదన్న విషయం తెలుసుకొని హరిహర పై అనుమానం రావడంతో ఈ నెల 22న నార్కట్‌పల్లి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తులో నివ్వెరపోయే నిజాలు బయట పడ్డాయి.
నవీన్ మృతదేహాన్ని పోలీసులు హైదరాబాద్ నగర శివారులో గుర్తించి పోస్ట్ మార్టానికి పంపించారు. తాను ప్రేమించిన అమ్మాయి తనకు దక్కదేమో అన్న అక్కసుతో నవీన్ ని హత్య చేసినట్లు హరిహర ప్లాన్ చేశాడని పోలీస్ విచారణలో తేలింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. తమ కొడుకు ఉన్నత చదువు చదివి వృద్దిలోకి వస్తాడని భావించిన తల్లిదండ్రులు కొడుకు మరణంతో కన్నీరు మున్నీరవుతున్నారు. కాగా, ఈనెల 17న ఈ దారుణ ఘటన జరిగినా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.