బాధ్యత గల వృత్తి విద్యలో ఉన్న ఓ స్కూల్ ప్రిన్సిపల్ బరితెగించి స్కూల్ విద్యార్థిపై దారుణానికి పాల్పడ్డాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన సంచలనంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ లోని శామీర్‌పేటలో ప్రైవేట్ స్కూల్ లో ఓ వ్యక్తి ప్రిన్సిపల్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇదే స్కూల్ లో ఓ బాలిక 9వ తరగతి చదువుతోంది. అయితే ఇటీవల ఆ బాలిక స్కూల్ కు మాస్క్ పెట్టుకోవడం మరిచిపోయింది. మాస్క్ పెట్టుకోకుండా స్కూల్ కు వచ్చావా అంటూ ఆ బాలికతో ప్రిన్సిపల్ వాగ్వాదానికి దిగాడు.
ఇంతటితో ఆగక గదిలోకి రావాలంటూ బలవంతం పెట్టాడు. దీంతో భయపడిన ఆ బాలిక అతను చెప్పినట్లే ఓ గదిలోకి వెళ్లింది. వెళ్లిన మరుక్షణమే ఆ దుర్మార్గుడు ఆ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం ఈ విషమం ఎవరికి చెప్పొద్దని, చెబితే చంపేస్తానంటూ బెదిరింపులకు గురిచేశాడు. ఇక చాలా రోజుల తర్వాత ఎట్టకేలకు స్కూల్ ప్రిన్సిపల్ చేసిన బాగోతం బయటపడింది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.ఈ విషయం ఆ బాలిక తల్లికి తెలియటంతో వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. విద్యా బుద్దులు నేర్పించాల్సిన గురువే ఇంతటి దారుణానికి పాల్పడంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.