యువతీ యువకుల మధ్య ప్రేమ అనేది సర్వసాధారణం అయిపోయింది. వయసుతో సంబంధం లేకుండా ఏ దొక వయసులో ఆ మాయపో పడే ఉంటారు. కానీ, ప్రేమ అనగానే ఏ తల్లిదండ్రులైనా కోప్పడతారు, కంగారు పడతారు. ఈ యువతికి చెందినవారు చాలా ఎక్కువగా స్పందించారు. తమ కుమార్తెను ప్రేమిస్తున్నాడనే అనుమానంతో యువకుడిని ఇంటికి పిలిపించి అత్యంత దారుణంగా తాళ్లతో కట్టేశారు. గదిలో పెట్టి దాడి చేశారు. ఈ పైశాచిక చర్య కాజీపేట పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
వివరాల్లోకి వెళితే.. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ధర్మపురం గ్రామానికి చెందిన బైరపాక ప్రభుదాస్ కాంట్రాక్టర్ గా పనిచేస్తున్నాడు. డీజిల్ కాలనీలో కుటుంబంతో అద్దెకు ఉండేవాడు. ఆయన కుమారుడు ఇంటి యజమాని కూతురుతో చనువుగా ఉంటున్నాడనే అనుమానంతో రెండు కుటుంబాల మధ్య గొడవలు జరిగాయి. వెంటనే ప్రభుదాస్ కుటుంబం ఇల్లు ఖాళీచేసి దూరంగా వెళ్లిపోయారు. అనుమానం వదలని అమ్మాయి బంధువులు బుధవారం యువతితో ప్రసాద్ కు ఫోన్ చేయించారు. యువతి పిలవడంతో అనుమానించకుండా ప్రసాద్ వెళ్లిపోయాడు.
యువకుడిని లాక్కెళ్లి తాళ్లతో కాళ్లు, చేతులు కట్టేసి గదిలో బంధించారు. యువతి బంధువులు యువకుడిపై విచక్షణారహితంగా దాడి చేశారు. అతడిని కొడుతున్నప్పుడు ఫొటోలు, వీడియోలు తీసి యువకుడి మిత్రులకు పంపడంతో అసలు విషయం వెలుగు చూసింది. బంధుమిత్రులతో వెళ్లి బతిమాలుకుని ప్రసాద్ ను విడిపించుకున్నారు. మళ్లీ అమ్మాయి జోలికి రాకూడదని లెటర్ రాయించుకుని వదిలేశారు. ఈ ఘటనపై యువకుడి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువతివైపు వాళ్లు కూడా ఫిర్యాదు చేయండంపో ఇరు వర్గాలపై కేసు నమోదైంది. యువకుడి పరిస్థితి విషమంగా ఉండడంతో ఎంజీఎంలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: తరగతి గదిలో దారుణం..బాలిక కేకలు! వెళ్లి చూస్తే..!