ఒక అమ్మాయిని ఇద్దరు అబ్బాయిలు ప్రేమించడం.. ఆ ఇద్దరినీ ఆ అమ్మాయి కూడా ప్రేమించడం అనే కథలు కామన్ గా వెండితెరపై మాత్రమే చూస్తుంటాం. కానీ, మారుతున్న సమాజ ధోరణులతో ఇప్పుడు లైవ్ లోనూ చూసే భాగ్యం కలుగుతోంది. అలాంటిదే ఇప్పుడు చెప్పుకోబోయే ఒక రాధా ఇద్దరు కృష్ణులు కథ. ముందుగా ఒక అబ్బాయి- అమ్మాయి ఇష్టపడ్డారు. ఆ తర్వాత ఆ యువతి మరొక అబ్బాయిపై మనసు పారేసుకుంది. ఆ విషయాన్ని మొదటి వాడికి చెప్పి రెండో వ్యక్తిని కూడా అదే రూమ్ లో పెట్టేసింది. ఇంకే ముంది ముగ్గురూ అన్యోన్యంగా ఉండటం మొదలు పెట్టారు. కానీ, కొన్నాళ్లకు మాత్రం సీన్ మొత్తం రివర్స్ అయ్యింది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన గుత్తి విజయ్, ఉష అనే మహిళ ఇద్దరూ చాలా రోజులుగా సహజీవనంలో ఉన్నారు. ఆ తర్వాత ఉషకు మరో వ్యక్తి అప్పాజీతో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వారి మధ్య మాటలు మాటలు కలిశాయి. ఆ మాటలు ఇంకాస్త ముదిరి అదేంటో.. అప్పాజీ మీద కూడా ఉషకు ప్రేమ పుట్టేసింది. ఆ తర్వాత స్ట్రైట్ గా ఆ విషయాన్ని విజయ్ కు చెప్పేసిన ఉష.. అప్పాజీని కూడా వారి రూమ్ కు ఆహ్వానించింది. ముగ్గూరూ అదే రూమ్ లో కలిసి హ్యాపీగా జీవించడం మొదలు పెట్టారు. అక్కడి వరకు అంతా బాగానే ఉంది.
రూమ్ లో ఎప్పుడూ వారి మధ్య గొడవలు జరగలేదు. వారు ముగ్గురూ ఎంతో అన్యన్యంగా ఉన్నారు. కొద్దిరోజుల క్రితం ముగ్గురూ కృష్ణాజిల్లా నందిగామలో ఓ హోటల్ లో పనిచేసేందుకు వెళ్లారు. అప్పటి వరకు తన మనసులోనే దాచుకున్న కోపం, ప్రతీకారం, కక్ష అన్నీ విజయ్ ఒక్కసారి బయట పెట్టేశాడు. అప్పాజీ రాకముందు ఉష తనను ఎంత ప్రేమించింది, తనను ఎంత బాగా చూసుకుంది గుర్తు చేసుకున్నాడు. ఆ తర్వాత అప్పాజీ రావడంతోనే వారి మధ్య దూరం పెరిగిందని విజయ్ భావించాడు. అందుకు ప్రతీకారం తీర్చుకునేందకు సిద్ధపడిపోయాడు.
ఇదీ చదవండి: నిద్రపోతున్న భార్యను.. గొడ్డలితో నరికి చంపిన భర్త..
రాత్రి నిద్రపోతున్న అప్పాజీపై విజయ్ కత్తితో దాడి చేశాడు. పదునైన కత్తితో అప్పాజీ పీక కోసి విజయ్ హత్య చేశాడు. ఆ ఘటనలో ప్రియురాలు ఉషకు కూడా గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. గాయాలపాలైన ఉషను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. ఆ సమయంలోనే వీరి సహజీవనం ఎపిసోడ్ వెలుగు చూసింది. మొదట పోలీసులు కూడా బిత్తరపోయారు వారి కథ విని. తేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.