వివాహేతర సంబంధాలు.. ఇవే ఈ మధ్యకాలంలో మూడు ముళ్ల బంధాల విలువలను కాలరాస్తున్నాయి. భర్తను కాదని భార్య, భార్యను కాదని భర్త.. ఇలా పరాయి వాళ్ల మోజులో పడి పచ్చటి సంసారానికి చేజేతులా నిప్పుపెట్టుకుంటున్నారు. పడక సుఖానికి అలవాటు పడి ఆ మైకంలో ఏం చేస్తున్నారో అర్థం కాక చివరికి హత్యలకు కూడా వెనకాడని ఘటను వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఇలాంటి సంచలన ఘటనే గంటూరు జిల్లాలో చోటు చేసుకుంది.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వీరులపాడుకు చెందిన నాగమల్లేశ్వరికి గురజాల మండలం అంబాపురానికి చెందిన వ్యక్తితో గతంలో వివాహమైంది. వీరికి పెళ్లైన కొంతకాలానికే భర్త మరణించడంతో భార్య ఏకాకిగా మిగిలిపోయింది. బిక్కుబిక్కుమంటూ భర్త మరణాన్ని దిగమింగుకోలేని నాగమల్లేశ్వరి కొన్ని రోజుల తర్వాత సత్తెనపల్లిలో ఉపాధి కోసం ఓ హోటల్ లో పనికి కుదిరింది. అలా తాను పనిచేస్తూ తన ఒంటరి జీవితాన్ని నెట్టుకుంటు వస్తుంది. అయితే ఈ క్రమంలోనే నాగమల్లేశ్వరికి అదే హోటల్ లో పని చేస్తున్న చాంద్ బాషా అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆ పరిచయం కాస్త రాను రాను వివాహేతర సంబంధానికి దారి తీసింది.
దీంతో వాళ్లిద్దరూ ఏకంతంగా తెర వెనక సంసారాన్ని నడిపిస్తూ ఉన్నారు. కానీ నాగమల్లేశ్వరి చాంద్ బాషాకు తెలియకుండా మరో ఇద్దరితో ఎఫైర్ నడిపించింది. ఇక కొన్ని రోజులకు నాగమల్లేశ్వరికి చాంద్ బాషాకు మధ్య వివాదాలు చెలరేగాయి. నువ్వు మరొకడితో వివాహేతర సంబంధం పెట్టుకున్నావని, నీ అంతు చూస్తా అంటూ చాంద్ బాషా బెదిరించాడు. దీంతో భయంతో వణికిపోయిన నాగమల్లేశ్వరి మరో ఇద్దరి ప్రియుళ్లతో చాంద్ బాషా హత్యకు ప్లాన్ వేసింది.
ఇక ఓ రోజు మద్యం తాగుదామని చాంద్ బాషాను ఇద్దరు పియులు పిలుపించుకుని తాగిన తర్వాత చాంద్ బాషాను ఇద్దరు కలిసి హత్య చేశారు. ఇక ఈ విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అనుమానమున్న నాగమల్లేశ్వరిని విచారించారు. పోలీసుల విచారణలో ఖంగుతిన్న ఆ వివాహిత ఎట్టకేలకు చేసిన తప్పుని ఒప్పుకుని మరో ఇద్దరిని పట్టించింది. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది.