ఈ మద్య దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రమాదాలకు కారణం అతి వేగం, మద్య సేవించి వాహనాలు నడపడం అని అధికారులు అంటున్నారు. రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుక ప్రభుత్వాలు ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా ప్రతిరోజూ పదుల సంఖ్యల్లో ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో శనివారం ముగ్గురు యువకులు ప్రయాణిస్తున్న బైక్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురికావడంతో పుట్టినరోజు వేడుకలు విషాదంగా మారాయి. బైక్ రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు.
ఇది చదవండి: కూతురి కేకలు విని పరుగున వెళ్లిన తండ్రి. రక్తపు మడుగులో..!
గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కృష్ణాయపాలెం వద్ద ప్రమాదం జరిగింది. మృతులు పెనుమాక వాసులుగా గుర్తించారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా.. ముగ్గురు విద్యార్థులు ఎక్కడి నుంచి వస్తున్నారు.. ప్రమాదం ఎలా జరిగిందన్న విషయాలను ఆరాతీస్తున్నారు. పెనుమాక గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు మరణించడంతో గ్రామంలో విషాదం అలుముకుంది. మృతుల కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు మంగళగిరి పోలీసులు తెలిపారు. ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.