సక్రమం కాని అక్రమ సంబంధాలు ఎన్నో జీవితాలను నాశనం చేస్తున్నాయి. కట్టుకున్న వారిని కాదని తప్పుడు బంధాలతో క్షణిక సుఖాల కోసం చేయకూడని పనులు చేస్తున్నారు. అంతేకాదు తమ బంధాలు బయటపడుతాయనే భయంతో ప్రాణాలు తీసేందుకు కూడా వెనుకాడటం లేదు. అలాంటి ఓ దుర్మార్గుడు ఎంతో మంది మహిళలతో తప్పు బంధ పెట్టుకుని వారి జీవితాలతో ఆడుకున్నాడు. అతని విషయం తెలుసుకుందని ఓ మహిళను గొంతుకోసి హత్య చేశాడు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన పులుగు రామకృష్ణారెడ్డికి ఎంతో మంది మహిళలతో అక్రమ సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి. మహిళలను మోసం చేసి డబ్బు దోచుకెళ్లడంలో అతనిది అందె వేసిన చేయి. తాజాగా బాపట్ల పెయింటర్స్ కాలనీకి చెందిన సుగుణ అనే ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. తరచూ ఆమె ఇంటికి వెళ్లి వస్తుండేవాడు. ఆ విషయం గమనించిన పక్కింటి భారతి సుగుణను హెచ్చరించింది. రామకృష్ణారెడ్డి గురించి అన్ని వివరాలు భారతికి తెలుసు. భారతి మాటలతో బెంబేలెత్తిపోయిన సుగుణ వెంటనే రామకృష్ణారెడ్డితో గొడవకు దిగింది.
సుగుణ.. రాణకృష్ణారెడ్డిని నిలదీసింది. తన వద్దకు రావొద్దంటూ దూరం పెట్టింది. ఆ విషయంలో రామకృష్ణారెడ్డి చాలా సీరియస్ అయ్యాడు. భారతిపై పగ పెంచుకున్నాడు. ఎలాగైనా భారతికి గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకున్నాడు. అందుకు స్నేహితుడు మహేశ్ సాయం కోరాడు. సుగుణ సాయంతో మహేశ్.. భారతిని పిలిపించాడు. ఆమెను కారులో ఎక్కించుకుని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు. అక్కడికి ముందే చేరుకున్న రామకృష్ణారెడ్డి ఆమె గొంతు నులిమి హత్య చేశాడు. ఆమె ఒంటిపై ఉన్న బంగారు గొలుసు, ఉంగరాలు తీసుకుని పరారయ్యారు. భారతి కుమార్తె ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ మృతదేహం లభ్యమైందని వారికి చూపించగా.. అది భారతిదేనని నిర్ధారించుకున్నారు.
ఇదీ చదవండి: తల దాచుకోవడానికి వస్తే.. తల్లిని చేశాడు!
ఆ తర్వాత దర్యాప్తులో రామకృష్ణారెడ్డి హస్తమున్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. అతడిని అదుపులోకి తీసుకున్నాక మరిన్ని విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. రామకృష్ణారెడ్డిపై గతంలోనే క్రిమినల్ కేసులున్నాయి. హైదరాబాద్ లో 2011లో స్టాఫ్ నర్స్ గా ఉన్న సమయంలో ప్రమీల అనే మహిళను మోసం చేశాడు. ఆ తర్వాత ఎన్ఆర్‌ఐ ఆస్పత్రిలో ఉద్యోగం పేరుతో మరో యువతి వద్ద డబ్బు వసూలు చేశాడు. ఈ విషయాలు మొత్తం వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు మర్డర్ కేసులో నిందితుడిగా ఉన్నాడు. రామకృష్ణారెడ్డి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ హత్య స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.