నేటికాలంలో స్త్రీలు, పురుషులు అనే తేడానే లేదు కారణం.. అందరూ అన్ని రంగాల్లో సమాన స్థాయిలో ముందుకెళ్తున్నారు. ఇంకా ఒక విధంగా చెప్పాలంటే కొన్నిరంగాల్లో ఆడవాళ్లుకు పోటీగా.. మగవారు పోలేకపోతున్నారు. ఇంతలా నాగరికత పెరిగిన సమాజంలో ఓ తల్లి దారుణానికి ఒడిగట్టింది. తానూ ఓ ఆడదానినే అన్న విషయం మరిచిందో లేక.. ఈ కాలంలో కూడా ఆడ పిల్లలంటే భారంగా భావించిందో ఏమో కానీ.. ఆ తల్లి నెలలు నిండని పసికందును దారుణంగా హతమార్చింది. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది.
స్థానిక ఏఎన్ఎం తెలిపిన ప్రకారం.. గుంటూరు జిల్లా తాడికొండ మండలం రావెల గ్రామానికి చెందిన బొంతా లక్ష్మి ఈనెల 2న గుంటూరు జీజీహెచ్ లో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. గత సోమవారం లక్ష్మి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయింది. ఆ రోజు వైద్యసిబ్బంది పాపను పరిశీలించి ఆరోగ్యంగా ఉందని తెలిపారు. మరుసటి రోజు పాప నోటి నుంచి నురగ వస్తోందని తల్లి బొంతా లక్ష్మి వైద్యసిబ్బందికి సమాచారం ఇవ్వాగా.. వారు జీజీహెచ్ కు వెళ్లమని తెలిపారు.
స్థానిక ఏఎన్ఎం ఎం. స్వప్న సాయంత్రం పాపను చూసేందుకు వెళ్లారు. పాప చనిపోయిందని, ఖననం కూడా చేశామని బొంతా లక్ష్మి సమాధానమిచ్చింది. ఆమె చెప్పిన మాటలు అనుమానంగా ఉంటండంతో ఏఎన్‌ఎం స్వప్న.. లక్ష్మిని నిలదీసి అడిగింది. తనకు ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలు, ఒక బాబు ఉన్నారని, మళ్లీ ఆడపిల్ల పుట్టడంతో తానే పాప గొంతులో వేలుపెట్టి చంపేసినట్లు నేరం అంగీకరించింది. అంతటితో ఆగక మీరు ఈ విషయం పోలీసులకు చెబితే చనిపోతానని లక్ష్మి బెదిరించిందని ఏఎన్ ఎం స్వప్నం ఫిర్యాదులో తెలిపింది. ఏఎన్ ఎం స్వప్న చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గ్రంధి వెంకటాద్రి తెలిపారు. కడుపులో పెట్టుకొని కాచుకోవాల్సిన కన్నతల్లే ఇలా నెలలు నిండని పసి కందుని కడతేర్చడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.