అందరూ వారం నుంచి ప్రేమికుల రోజు హడావుడిలో ఉండిపోయారు. తాము ప్రేమించే వారికి ఎలాంటి గిఫ్ట్ ఇవ్వాలి. ఆ రోజును ఎలా గడపాలి అంటూ ప్లానింగ్స్ లో ఉండిపోయారు. కానీ, ఈ వార్త మాత్రం ప్రేమికుల మనసును కకావికలం చేసేస్తుంది. ఎందుకంటే ప్రేమ పేరుతో ఓ యువకుడు చేసిన దారుణం ప్రేమికుల రోజు వెలుగు చూసింది. ప్రేమించలేదనే అక్కసులో ఓ యువతిని అతి కిరాతకంగా గొంతుకోసి హత్య చేశాడు. అడ్డొచ్చిన కుటుంబ సభ్యులపై కూడా దాడికి తెగబడ్డాడు. తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించాడు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
వివరాల్లోకి వెళితే.. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రం సూరత్ లో జరిగింది. ఫనిల్ గోయాని(22), గ్రీష్మ వెకారియా(21)లు సూరత్ లో ఒకే పాఠశాలలో చదువుకున్నారు. వాళిద్దరూ స్కూల్ నుంచే మంచి ఫ్రెండ్స్.. ఎంతో కలివిడిగా ఉండేవారు. అయితే ఏడాది క్రితం నుంచి గోయాని ప్రవర్తనలో మార్పు వచ్చింది. ప్రేమ పేరుతో గ్రీష్మను ఒత్తిడి చేయడం మొదలు పెట్టాడు. తనకు అలాంటి ఉద్దేశం లేదని గ్రీష్మ తెగేసి చెప్పేసింది.
తన ప్రేమను అంగీకరించాలంటూ గోయాని.. ఆమెను నిత్యం వేధింపులకు గురి చేసేవాడు. కొన్నాళ్లకు గోయాని తీరుతో విసిగిపోయిన గ్రీష్మ అసలు విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. గ్రీష్మ, ఆమె తమ్ముడిని తీసుకుని వారి మేనమామ శనివారం సాయంత్రం కామ్ రేజ్ ప్రాంతానికి వెళ్లాడు. అక్కడున్న గోయానిని కలిశారు. గ్రీష్మను ఇబ్బంది పెట్టొద్దని గట్టిగా మందలించాడు. ఇంతకాలంగా వెంటబడుతున్నా తన ప్రేమను అంగీకరించడం లేదని ఉన్మాదిగా మారిపోయాడు. తనవెంట తెచ్చుకున్న కత్తితో గ్రీష్మపై దాడి చేశాడు. ఆమె గొంతు కోయడంతో.. అక్కడికక్కడే మరణించింది.
ఇదీ చదవండి: భార్య గొంతు నులిమి, పసికందు ముక్కు మూసి! వేడుకున్నా వదల్లేదు!
దాడిలో గ్రీష్మ తమ్ముడు, మేనమామకు కూడా గాయాలు అయ్యాయి. అనంతరం గోయాని కూడా ఆత్మహత్యకు యత్నించాడు. కత్తితో చేయి కోసుకున్నాడు. విషం తాగేందుకు ప్రయత్నించాడు. సమాచారం అందుకున్న పోలీసులు గోయానిని ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రేమికుల రోజున ఈ దారుణం వెలుగు చూడటం అందరినీ కలచి వేసింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.