సభ్య సమాజంలో ఆడబిడ్డలపై అఘాయిత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. ముక్కుపచ్చలారని చంటి బిడ్డ నుంచి నడుం ఒంగిన ముసలమ్మ దాకా ఎవరికీ రక్షణ లేదు. ఓ నిర్భయ, ఓ దిశ ఇలా ఈ జాబితా కొనసాగుతూనే ఉంది. ఎంత కఠినంగా శిక్షలు వేసినా.. నిలబెట్టి ఎన్ కౌంటర్ చేసినా కూడా ఈ కామాంధుల కోరల్లో నుంచి ఆడబిడ్డలను కాపాడలేకపోతున్నారు. తాజాగా గుజరాత్ లో సభ్యసమాజం తలదించుకునే ఘటన జరిగింది. ఆరుగురు టీనేజర్లు ఓ విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
వివరాల్లోకి వెళ్తే.. నర్మద జిల్లాలో పదకొండో తరగతి చదివే విద్యార్థినిపై ఈ దారుణానికి ఒడిగట్టారు. బాధిత బాలికను మొదట నిందితుడు బైక్ పై ఎక్కించుకుని ఓ పాఠశాల వెనుకకు తీసుకెళ్లాడు. అక్కడ అప్పటికే కాపు కాసిన అతని మిత్రులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుడు తెలిసిన వ్యక్తి కావడంతో అతడిని నమ్మ ఆ విద్యార్థిని బైక్ పై వెళ్లినట్లు తెలుస్తోంది.
ఈ ఘటనను ఛాలెంజింగ్ గా తీసుకున్న పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేశారు. ఈ దారుణానికి సంబంధించిన ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇంతటి దారుణానికి ఒడిగట్టిన వారికి ఎలాంటి శిక్ష విధించాలి? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: కడుపు చేసి.. పెళ్ళికి నిరాకరించి! అధికార పార్టీ లీడర్ దారుణం!