ఒకరి అవసరం మరొకరికి అవకాశం మారుతుంది అనే మాట నూటికి నూరు శాతం వాస్తవం. అలాంటి సందర్భాలు చాలానే చూశాం. ఒకరి నిస్సహాయతను అదునుగా తీసుకుని ఎందరో దారుణాలకు ఒడిగట్టారు. అలాంటి జాబితాలో మరో బాధితురాలు చేరింది. ఓ తండ్రి ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతూ తన ముగ్గురు కుమార్తెలను పోషించలేక.. ఒకమ్మాయి సోదరి ఇంటికి పంపాడు. మేనత్త ఇల్లేగా అని ఆమె కూడా ధైర్యంగా వెళ్లింది. అక్కడున్న పెళ్లైన బావ కన్ను ఆ బాలికపై పడింది. రెండేళ్లపాటు ఆమెపై లైంగిక దాడి చేశాడు. ఆ తర్వాత ఆమె తల్లి కూడా అయ్యింది. బిడ్డను తల్లిని మళ్లీ తండ్రి దగ్గర వదిలేసి చేతులు దులిపేసుకున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
వివరాల్లోకి వెళ్తే.. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ జిల్లా రన్ చర్ద్ గ్రామంలో ఈ దారుణం వెలుగు చూసింది. ఓ నిరుపేద తండ్రికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అతను కుటుంబ పోషణను తట్టుకోలేక రెండేళ్ల ఒక కుమార్తెను రన్ చర్ద్ లోని తన సోదరి ఇంటికి పంపాడు. అక్కడ అంతా బాగానే ఉందని అనుకున్నాడు. అక్కడున్న తన మేనల్లుడి కన్ను కుమార్తెపై పడిందని తెలుసుకోలేక పోయాడు. అతనికి ఇదివరకే పెళ్లైంది. అతని భార్య కూడా అక్కడే ఉంటుంది. దాదాపు రెండేళ్లుగా ఆ దుర్మార్గుడు ఆమెపై లైంగిక దాడి చేస్తున్నాడనే విషయం తెలుసుకోలేక పోయారు.
ఆమె తల్లి అయ్యేదాకా కూడా ఆ విషయం ఎవరికీ తెలియదు. ఆ తర్వాత ఆమె ఓ బిడ్డకు జన్మనిచ్చింది. కొన్నాళ్లకు ఆ విషయం అతని తల్లి, భార్యకు తెలిసినా కూడా వాళ్లు కుటుంబం పరువు పోతుందని బయటకు చెప్పలేదు. ఇంట్లోనే ఉంటే వారికి ఇబ్బందులు వస్తాయని తెలిసి గుట్టుచప్పడు కాకుండా ఆమెను స్వగ్రామంలో వదిలేశారు. ఆ తర్వాత వీళ్లు మళ్లీ రన్ చర్ద్ కు వెళ్లిపోయారు. అయితే ఆశ్రయం కోసం పంపిస్తే ఇలా చేయడాన్ని ఆ తండ్రి సహించలేకపోయాడు. తన కుమార్తెకు జరిగిన అన్యాయం విషయంలో పోలీసులను ఆశ్రయించాడు.
ఇదీ చదవండి: వీడియో: భార్యను వివస్త్రను చేసి దారుణంగా కొట్టిన భర్త.. కారణం?
బాధిత బాలిక ఇచ్చిన సాక్ష్యం ఆధారంగా పోలీసులు కామాంధుడు సహా భార్య, అతని తల్లిపై కేసు నమోదు చేశారు. ఆ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఇన్ స్పెక్టర్ హెచ్ పీ ఝాలా తెలిపారు. మరెవరికీ అలాంటి ఆలోచన రాకుండా కఠిన శిక్ష పడేలా చూస్తామంటూ ఇన్ స్పెక్టర్ తెలిపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆశ్రయం కోసం వచ్చిన బాలికపై లైంగిక దాడి చేసి తల్లిని చేస్తారా అంటూ అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.