ఈ మధ్యకాలంలో భర్తను కాదని కొంతమంది మహిళలు యదేచ్ఛగా వివాహేతర సంబంధాలను నడిపిస్తున్నారు. ఇంతటితో ఆగుతున్నారా? అంటే అదీ లేదు. ప్రియుని మోజులో పడి చివరికి భర్తను, పిల్లలను కాదని అతని వెంటే వెళ్లిపోతున్న ఘటనలు అనేకమవుతున్నాయి. ఇటీవల గుజరాత్ లో ఓ ఆరుగురు పిల్లల తల్లి మైనర్ బాలుడితో వెళ్లిపోయి చివరికి కటకటాల పాలైంది. అసలు విషయం ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం.
గుజరాత్‌లోని దహోడ్ జిల్లా సమీపంలోని అమ్లిఖేడా ప్రాంతం. ఇదే ప్రాంతంలో ఓ భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. కొన్నేళ్ల తర్వాత ఈ దంపతులకు ఆరుగురు పిల్లలు జన్మించారు. అలా కొంతకాలం పాటు వీరి జీవితం సాఫీగానే సాగుతూ వచ్చింది. ఈ క్రమంలోనే భర్తతో పాటు పనికెళ్లే చోట భార్య మైనర్ బాలుడితో ప్రేమాయణం నడిపేందుకు అనేక ప్రయత్నాలు చేసింది.. విజయం కూడా సాధించింది. అయితే ముందుగా ఆ 14 మైనర్ బాలుడితో మెల్లగా మాట్లాడటం చేస్తూ ఉండేది. దీంతో ఇద్దరి మధ్య కాస్త ప్రేమ చిగురించింది.
దీంతో ఆ మహిళ భర్తను, పిల్లలను కాదని చివరికి ఆ మైనర్ బాలుడితో లేచిపోయింది. ఇదే విషయాన్ని తెలుసుకున్న భర్త ఆ బాలుడి తల్లిదండ్రుల వద్దకు వెళ్లి మీ కుమారుడు నా భార్యకు మాయమాటలు చెప్పి తీసుకెళ్లాడని గొడవ చేసేంత పని చేశాడు. ఈ విషయంలో ఏం చేయాలో తెలియక ఆ బాలుడి తండ్రి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేస్తూ.. అభం శుభం తెలియని ఓ వివాహిత నా కుమారుడిని తీసుకెళ్లిపోయిందని తెలిపాడు.
ఇక రంగంలోకి దిగిన పోలీసులు ఆ బాలుడి పుట్టిన తేదీ ఆధారంగా మైనర్ గా గుర్తించారు. మైనర్ బాలుడితో ప్రేమాయణం ఏంటంటూ.. వివాహితపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇటీవల గుజరాత్ లోని అమ్లిఖేడా ప్రాంతంలో జరిగిన ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. 14 ఏళ్ల మైనర్ బాలుడితో ఆరుగురు పిల్లల తల్లి లేచిపోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.