నేటి సమాజంలో మానవ మృగాలు బాగా పెరిగిపోతున్నాయి. ఆ మృగాలు ఒంటరిగా కనిపించిన ఆడవారిపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నాయి. ఆడపిల్లలు బయటకు రావాలంటేనే బయపడేలా మనిషి రూపంలో ఉన్న కొన్ని పశువులు దారుణాలకు తెగపడుతున్నాయి. పాలు తాగే పసి పిల్ల నుంచి పండు ముసలావిడ వరకు ఎవర్ని వదలకుండా తమ కామ కోరికలకు బలి చేస్తున్నారు. ఇలాంటి పశువులపై ప్రభుత్వాలు, పోలీసులు ఎన్ని కఠినమైన చర్యలు తీసుకుంటున్నా నేరాలు ఆగటం లేదు. తాజాగా ఓ కామాంధుడు.. లిఫ్ట్ ఇస్తానని నమ్మించి 90 ఏళ్ల వృద్ధురాలిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. సభ్య సమాజం తలదించుకునేలా ఉన్న ఈ ఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
మధ్యప్రదేశ్ రాష్ట్రం షాహ్ డోల్ జిల్లాలోని ఆంత్రా అనే గ్రామంలోని తన బంధువుల ఇంటికి వెళ్లేందుకు జబల్ పూర్ నుంచి 90 ఏళ్ల వృద్ధురాలు షాహ్ డోల్ రైల్వేస్టేషన్ దిగింది. ఆమె బంధువుల గ్రామమైన ఆంత్రా.. జిల్లా కేంద్రానికి 15 కిలోమీటర్ల దూరం ఉంది. ఆమె షాహ్ డోల్ రైల్వేస్టేషన్ కి చేరుకునే సమయానికి అర్ధరాత్రి కావడంతో స్టేషన్ లోనే ఉండిపోయారు. మరుసటి రోజు ఉదయం రైల్వే స్టేషన్ నుంచి బయటకి వచ్చిన ఆ మహిళ ఆటో ఎక్కి బంధువుల గ్రామానికి బయలుదేరింది. ఆటోడ్రైవర్ గ్రామానికి సమీపంలో ఉన్న మెయిన్ రోడ్డుపైనే ఆమెను దించేసి వెళ్లాడు. అక్కడి నుంచి వెళ్లేందుకు ఆమె బస్సు కోసం ఎదురు చూస్తూ ఉంది. ఇదే సమయంలో అటుగా ఓ వ్యక్తి బైక్ పై వచ్చి..లిఫ్ట్ ఇస్తానని ఆమెను నమ్మించాడు. అతడి మాటలు నమ్మిన ఆ వృద్ధురాలు బైక్ ఎక్కారు.
నిర్మానుష ప్రాంతంలోకి వెళ్లిన తరువాత ఆ వ్యక్తి బైక్ ను ఆపి.. ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెను తీసుకొచ్చి ప్రధానరహదారిపై వదిలి పారిపోయాడు. చివరకు బంధువుల ఇంటికి చేరుకున్న బాధితురాలు.. జరిగిందంతా చెప్పారు. దీంతో బాధితురాలి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అత్యాచారం, ఇతర సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. బాధితురాలికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అలానే దారుణానికి ఒడిగట్టిన ఆ నిందితుడి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. స్థానికులు సైతం నిందితుడి కోసం పెద్ద ఎత్తున గాలింపులు చర్యలు చేపట్టారు. ఒకవేళ తమకే దొరికితే చంపేస్తామని కొందరు స్థానికులు అన్నట్లు సమాచారం. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.