ప్రేమ అనేది ఎప్పుడు ఎవరిని ఏ స్థితిలోకి తీసుకెళ్తుందో చెప్పలేము. ఇంకోవైపు ప్రేమ పేరుతో మోసం చేసే ప్రబుద్ధులకు కొదవే లేదు. అయితే కొందరు మాత్రం ప్రేమించిన వ్యక్తి లేకపోతే ఆత్మహత్య చేసుకుని జీవితాన్ని కోల్పోతున్నారు. తాజాగా ఓ వ్యక్తి.. ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. విధి ఆడిన వింత నాటకంలో అతడిని వదలి ఆమె తిరిగిరాని లోకాలకు వెళ్లింది. ఆ దుఃఖాన్ని భరించలేక ఆవేదనకు గురయ్యాడు. భార్య మరణించిన రెండేళ్లు అయినా మరచిపోలేకపోయాడు. భార్య ఎడబాటుని తట్టుకోలేని.. ఆ భర్త భార్య సమాధి వద్ద ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన కామారెడ్డి జిలాల్లో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన సమాచారం ప్రకారం..
కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన 28 ఏళ్ల పుట్ట సురేష్ ..అదే గ్రామానికి చెందిన నిర్మల అనే కొన్నేళ్ల క్రితం యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే రెండేళ్ల కిత్రం సురేష్ భార్య నిర్మల అనారోగ్యంతో మరణించింది. ప్రేమించిన పెళ్లి చేసుకున్న భార్య అకాల మరణాన్ని సురేష్ తట్టుకోలేకపోయాడు. ఇక అప్పటి నుంచి మానసికంగా ఆవేదన చెందుతున్నాడు. నిత్యం భార్య సమాధి వద్దకు వెళ్తుండే వాడు. భార్యలేని జీవితం తనకు వద్దు అంటుండే వాడు. ఈక్రమంలో ఆగష్టు 2న భార్య నిర్మల సమాధి వద్ద భర్త సురేష్ పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. ఆత్మహత్యాప్రయత్నం చేసిన సురేష్ ను మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ కు తరలించారు.
గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. సురేష్ మృతి చెందాడు. సురేష్ మృతితో కుటుంబంలో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసుకొన్న రాజంపేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరి.. భార్య చనిపోతే మరో పెళ్లి చేసుకుంటున్న భర్తలు ఉన్న ఈ కాలంలో భార్య మరణాన్ని తట్టుకోలేక ఇలాంటి నిర్ణయం తీసుకున్న సురేష్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.