శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం వృద్ధి చెందని రోజుల్లో ప్రజలు మూఢ విశ్వాసాలు కలిగి ఉన్నారు. అయితే అనేక మంది సైంటిస్టుల కృషి ఫలితంగా అనేక ఆవిష్కరణలు జరిగాయి. ప్రస్తుతం చాలా వరకు ప్రతి ఒక్కరు సాంకేతి పరిజ్ఞానం ఆధారంగానే పనులు నిర్వహిస్తున్నారు. చాలా వరకు ముఢనమ్మకాలను ఎవరు పాటించడం లేదు. అయితే కొన్ని చోట్ల మాత్రం ఇంకా అలాంటి నమ్మకాలతో కొందరు మనుషులు జీవిస్తున్నారు. అందుకు ఉదాహరణంగా తాజాగా కర్ణాటకలో ఓ ఘటన చోటుచేసుకుంది. నీట మునిగి చనిపోయిన మరణించిన బాలుడి మృతదేహానికి ఉప్పు పాతర వేస్తే బతుకుతాడన్న నమ్మకంతో ఆ బాలుడి తల్లిదండ్రులు ఉప్పు పాతర వేశారు. వివరాల్లోకి వెళ్తే..
కర్ణాటక రాష్ట్రం బళ్లారి తాలూకాలోని సిరివార గ్రామంలో శేఖర్, గంగమ్మ అనే దంపతులు వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరి చిన్న కుమారుడి పేరు భాస్కర్(10). చిన్నవాడు కావడంతో ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. వాడిపై ఎన్నో ఆశలు పెట్టుకుని కష్టపడి చదివిస్తున్నారు. అయితే సోమవారం తోటిపిల్లలతో కలసి ఈతకు వెళ్లిన భాస్కర్ నీటి గుంతలో పడి మృతి చెందాడు.
ఆ ప్రాంతంలో మూఢనమ్మకాలు బలంగా ఉన్నాయి. అలా నీటిలో పడి చనిపోయిన వ్యక్తిని.. మరణించిన రెండు గంటల్లోపు ఉప్పుతో కప్పి పెడితే బతుకుతారనే బలంగా నమ్ముతారు.
దీంతో అదే మూఢ నమ్మకంతో ఆ బాలుడి తల్లిదండ్రులు సుమారు 4-5 బస్తాల ఉప్పును తెప్పించారు. అనంతరం మృతదేహంపై కుప్పగా పోశారు. అలా బాలుడు తిరిగి బతికి వస్తాడని దాదాపు 8 గంటల పాటు ఎదురు చూశారు. చివరకు ఆ బాలుడి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఉదంతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మరి.. ఈఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.