ప్రేమకు వయసుతో సంబంధం లేదు అంటారు. మరీ జీవితం అంటే ఏంటో తెలియని వయసులో అంటే కష్టం కదా? ఆ వయసులో పుట్టేదాన్ని ప్రేమ అని చెప్పడం కూడా కష్టమే. అలా 15 ఏళ్ల వయసులో బాలుడు ప్రేమ(భమ)లో పడ్డాడు. ఆ తర్వాత అతని ప్రవర్తనతో ఆ బాలిక కూడా ప్రేమలో పడాల్సి వచ్చింది. ఆ వయసులోనే పెళ్లి చేసుకోవాలంటూ ఆమె షరతు పెట్టడం. అందుకు ఆ కుర్రాడు హామీ ఇవ్వడం జరిగిపోయింది. ఆ తర్వాత తెలిసితెలియని వయసులో చేయకూడని పనులు కూడా చేశారు. పెళ్లి టాపిక్ వచ్చేసరికి సీన్ మొత్తం రివర్స్ అయ్యింది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
గొల్లప్లోలు ఎస్‌ఐ రామలింగేశ్వరరావు కథనం ప్రకారం.. తూర్పు గోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం కొడవలి గ్రామానికి చెందిన 17 ఏల్ల బాలిక పిఠాపురంలో ఎంఎల్ టీ ఒకేషనల్ కోర్సు చేస్తోంది. అదే గ్రామానికి చెందిన కుక్కా రామకృష్ణతో రెండేళ్లుగా ప్రేమలో ఉంది. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లాంటి పరిస్థితులు కాదులెండి. పురుగుల మందు డబ్బా పట్టుకుని ‘నా ప్రేమను ఒప్పుకుంటావా పురుగులమందు తాగి చావమంటావా’ అంటూ బెదిరించడంతో తప్పక ఒప్పుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ప్రేమ పేరుతో చాలా ప్రదేశాలకు చెట్టా పట్టాలేసుకుని తిరిగేశారు. ఆ వయసులోనే పెళ్లి చేసుకుంటానంటూ హామీలు ఇచ్చేసి.. ఆమెను లొంగదీసుకున్నాడు. వద్దని వారిస్తున్నా వినకుండా తన సెల్ ఫోన్ లో ఆ యువతి ఫొటోలు తీశాడు.
అప్పుడు ప్రేమతో తన గుర్తుగా ఆ ఫొటోలను దాచుకున్నాడు అనుకుంది. కానీ, ఆ తర్వాత ఆ ఫొటోలే ఆమె జీవితాన్ని ప్రశ్నార్థకంగా మారుస్తాయని అనుకోలేదు. ఆ తర్వాత ఆమెకు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. రామృష్ణను అడగగా ముఖం చాటేశాడు. కానీ, ఇంటికి వచ్చిన పెళ్లికొడుకు తరఫు వారికి మాత్రం వారు చనువుగా ఉన్న ఫొటోలు పంపిస్తూ పెళ్లి చెడగొడుతున్నాడు. ఆ విషయం తెలుసుకున్న బాలిక తనను వివాహం చేసుకోవాలంటూ నిలదీసింది. అందుకు తన తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదంటూ చెప్పాడు. ఈ విషయంపై గ్రామంలో గతేడాది డిసెంబరు 30న పంచాయితీ పెట్టారు. అక్కడ తనకు న్యాయం జరగలేదని ఆ బాలిక పోలీసులను ఆశ్రయించింది. రామకృష్ణపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. విషయం తెలుసుకున్న సన్నిహితులు, గ్రామస్థులు వారి వయసేంటి? ప్రేమ అంటూ వారు చేస్తోంది ఏంటి? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: అనుమానంతో ఫోన్ చెక్ చేసిన తల్లిదండ్రులు! కోరిక తీర్చాలంటూ..!