ప్రేమ ఓ మధుర భావన, ప్రేమ ఓ అనుభూతి, ప్రేమ ప్రతి ఒక్కరూ కోరుకునే అనుబంధం. ప్రతి ఒక్కకరు తమ జీవితంలో ఒక్కసారైన ప్రేమలో పడతారు. అయితే మీ ప్రేమలో, మీరు కోరుకున్న వారి ప్రేమలో ఎలాంటి దురుద్దేశం లేకుంటే మీ అంత అదృష్టవంతులు ఇంకొకరుండరు. ఈ మధ్య డబ్బు కోసం, అవసరాల కోసం ప్రేమ అనే పదాన్ని వాడుకుని మోసాలకు పార్పడుతున్న ఘటనలు ఎన్నో చూస్తున్నాం. ఇప్పుడు చెప్పుకోబోయే ఘటన కూడా అలాంటిదే. అయితే ఇక్కడ ఓ యువకుడు మోసపోయానంటూ ప్రాణాలు కూడా తీసుకున్నాడు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
వివరాల్లోకి వెళితే.. తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లి మండలం మాగం కొప్పిశెట్టివారిపాలెంలో కొప్పిశెట్టి శంకరరావు అనే యువకుడు ఉంటున్నాడు. అదే గ్రామానికి చెందిన ఓ యువతితో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయాడు. ఆమే నా లోకం, నా సర్వస్వం, నా లివర్, నా కిడ్నీ అనే దాకా వెళ్లింది పరిస్థితి. అయితే కొన్నిరోజుల క్రితం ఆ యువతి అతడ్ని వదిలేసింది. ఇంక శంకరరావుకు ఏం చేయాలో పాలు పోలేదు. ప్రేమించిన యువతి అలా చేసింది ఏంటని డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు. ఆ యువతి తనను మోసం చేసిందంటూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
అంతేకాకుండా ఓ సెల్ఫీ వీడియో కూడా తీసుకుని యువతి మోసం చేయడం వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపాడు. తనను ప్రేమిస్తున్నానంటూ తన వద్ద బంగారం, డబ్బు తీసుకుందని ఆరోపించాడు. ఆ యువతితో అతను కలిసి ఉన్న ఫొటోలను తన ఫ్రెండ్స్ వాట్సప్ గ్రూపుల్లోనూ పోస్టు చేశాడు. అయితే ఆ యువకుడికి గతంలోనే వివాహం అయ్యిందంటున్నారు. భార్యతో విడిపోయినట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడ తప్పు ఎవరిది అయినా కావచ్చు కానీ, ప్రాణం తీసుకోవడం పరిష్కారం కాదు.
ఇదీ చదవండి: విదేశాల్లో భర్త.. ప్రియుడి మోజులో భార్య! రోజు నగ్నంగా
ప్రేమ సక్సెస్ కాకపోతే తన ప్రాణాలు తీసుకోవడం లేదా ప్రేమించిన వాళ్ల ప్రాణాలు తీయడం క్షమించరాని నేరం. తన కుమారుడే లోకం అని బతికే తల్లిదండ్రులకు ఏం సమాధానం చెబుతారు? ప్రేమ విఫలమైందని క్షణికావేశంలో ప్రాణాలు తీసుకుంటే కన్నతల్లిదండ్రులు ఏమవ్వాలి? మీపై వాళ్లు పెట్టుకున్న ఆశలు ఏమవ్వాలి? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.