వివాహేతర సంబంధం అంటే.. అక్రమం అనే దగ్గరి నుంచి ఇట్స్ ప్యాషన్ అనే వరకు మారింది. ఎంత దారుణంగా ఉన్నాయంటే పరిస్థితులు.. కట్టుకున్న వాడిని జీరోగా పరిగణిస్తున్నారు. ఉంచుకున్న వాడు మాత్రం వీళ్లకు హీరో అయిపోతున్నాడు. బాధ్యతలు మోసేవాడు బకరాలా.. అవసరానికి వాడుకునేవాడు అందంగా కనిపిస్తున్నాడు. ఎన్ని ఘటనలు వెలుగు చూసినా కూడా మరో ఘటన జరుగుతూనే ఉంది. ప్రియుడి కోసం భర్తను కాటికి పంపితే.. కటకటాల పాలు కావాల్సిందే కదా అనే స్పృహ ఉండటం లేదు. అలా ఆలోచించే.. ఓ మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను కడ తేర్చింది. కానీ, ఆ విషయం బయటపడటంతో కటకటాల పాలు అయ్యింది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
వివరాల్లోకి వెళ్తే.. దేశ రాజధాని ఢిల్లీలో ఈ దారుణం వెలుగు చూసింది. రోహిణిలో ప్రదీప్ – సీమా దంపతులు నివాసముండేవారు. సీమకు భర్తంటే లెక్కలేదు. అస్సలు అతని మాట వినదు. మాటల్లోనే కాదు.. శృంగారం విషయంలో కూడా భర్తకు నో ఛాన్స్. అస్సలు దగ్గరకు రానిచ్చేది కాదు. ఆ విషయంలో భార్యాభర్తలకు గొడవలు కూడా జరిగాయి. కానీ, ఆమె మాత్రం భర్తను చేయి వేయనిచ్చేది కాదు. ఎందుకంటే ఆ రైట్స్ మొత్తం ఆమె ప్రియుడు గౌరవ్ కు రిజర్వ్ చేసి పెట్టుకుంది. దాదాపు 8 ఏళ్లుగా భర్తను దూరం పెట్టి ప్రియుడి ఒడిలోనే ఓలలాడుతోంది.
వారి చీకటి బంధం బయటకు రాకుండా చాలాకాలం బాగానే మేనేజ్ చేశారు. కానీ, ఓరోజు బయట ప్రపంచాన్ని మర్చిపోయి గౌరవ్ తో హద్దులు దాటి కోరికలు తీర్చుకునే సమయంలో ప్రదీప్ ఎంట్రీ ఇచ్చాడు. తన భార్యను వేరే వ్యక్తి ఒడిలో చూసి కంగుతిన్నాడు. ఏం జరుగుతోందంటూ భార్యను నిలదీశాడు. మళ్లీ తన భార్య వైపు కన్నెత్తికూడా చూడొద్దంటూ గౌరవ్ కు వార్నింగ్ ఇచ్చాడు. భర్తకు దొరికిపోవడంతో.. కొద్దిరోజులు గౌరవ్ కు దూరంగా ఉన్నట్లు నటిచింది. భర్త ఉంటే ప్రియుడిని కలుసుకోవడం కుదరదని భావించింది. ఆ విషయం గౌరవ్ కు కూడా చెప్పింది. ఎలాగైనా భర్త అడ్డు తొలగించుకోవాలని భావించింది.
ఇదీ చదవండి: నర్స్ పై కన్నేసి.. కోరిక తీర్చుకోడానికి మాస్టర్ ప్లాన్!
తన మనసులో మాట గౌరవ్ కు చెప్పడంతో అంతను కూడా అందుకు సరే అన్నాడు. తన సహచరులకు రూ.4 లక్షలు ఇచ్చి ప్రదీప్ ను చంపేందుకు స్కెచ్ వేశాడు. హెలిపోర్ట్ రోడ్డులో కాల్పుల్లో ఓ వ్యక్తి గాయపడినట్లు పోలీసులకు సమాచారం అందింది. అతడిని ఆస్పత్రికి తరలించారు. అతను అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆ వ్యక్తి ప్రదీప్(35)గా పోలీసులు గుర్తించారు. విచారణ చేయగా.. రింకూ పవార్(22), సౌరభ్ చౌదరి(23), ప్రశాంత్(22), పర్వీందర్(23), విషన్ కుమార్ లను(18) అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా.. సీమా, గౌరవ్ ల పేర్లు బయటకు వచ్చాయి. వారిని కూడా అరెస్టు చేశారు. ప్రియుడితో సరసాలు ఆడాలని భర్తను కాటికి పంపింది. చివరకు పాపం పండి కటకటాల పాలైంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.