Crime News: విదేశీ యువతులను కోర్కెలు తీర్చే బొమ్మలుగా మార్చిందో ముఠా. వారిని వ్యభిచార కూపంలోకి దింపి చిత్రహింసలకు గురి చేసింది. ఓ మహిళ వారినుంచి తప్పించుకుని పోలీసులను ఆశ్రయించటంతో అసలు సంగతి బయటపడింది. ఈ సంఘటన దేశ రాజధానిలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఢిల్లీకి చెందిన ఓ ముఠా ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి విదేశీ యువతుల్ని ఆకర్షించింది. అనంతరం బలవంతంగా కూపంలోకి దింపింది. వారు వదిలిపెట్టమని ఎంత బతిమాలినా వినలేదు. ఎంతో క్రూరంగా ప్రవర్తించింది. ప్రతీరోజు 10 మంది విటులతో కలిసేలా చేసింది. ఎదురుతిరిగితే చావకొట్టింది.
డ్రగ్స్ ఇచ్చి మరీ ఈ దారుణానికి పాల్పడింది. సదరు ముఠా ఎక్కువగా ఉజ్బేకిస్తాన్‌కు చెందిన వారిని టార్గెట్ చేసింది. టూరిస్ట్ వీసాలతో వచ్చేవారిని మోసగించేది. వీసాలు లాక్కుని చాలా మందిని బలవంతంగా కోర్కెలు తీర్చే బానిసలుగా మార్చింది. ఓ మహిళ వారినుంచి తప్పించుకుని బయటకు వచ్చింది. ఈ విషయాన్ని పోలీసులకు చెప్పింది. దీంతో పోలీసులు ముఠా సభ్యుల్ని అరెస్ట్ చేశారు. సదరు మహిళ తన కష్టాలను పోలీసులకు ఈ విధంగా చెప్పుకుంది. ‘‘ నేను 2019లో టూరిస్ట్ వీసా మీద ఉజ్బేకిస్తాన్‌నుంచి ఇండియా వచ్చాను.
ఇక్కడికి వచ్చిన తర్వాత ఉద్యోగం వెతకటం మొదలుపెట్టాను. అయితే, నేను అనుకున్నట్లు ఉద్యోగం రాలేదు. బ్రోకర్ నేను ఇండియాలోకి అడుగుపెట్టగానే నా పాస్‌పోర్టు లగేజీ స్వాధీనం చేసుకున్నాడు. నన్ను సౌత్ ఢిల్లీలోని ఓ ప్లాట్‌కు తీసుకెళ్లాడు. పాస్ పోర్టు ఇవ్వాలంటే వ్యభిచారం చేయాలని హెచ్చరించాడు. నాకు తప్పలేదు. ప్రతిరోజు 10 మంది దాకా వచ్చేవాళ్లు. నేను కాదంటే బ్రోకర్లు కొట్టేవాళ్లు. కొంతమందికి బలవంతంగా డ్రగ్స్ ఇచ్చి వాడుకునేవారు’’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : వైద్యుడి కోసం ఎదురు చూసి తల్లి ఒడిలోనే కన్నుమూసిన చిన్నారి!