ఈ మద్య కొంతమంది తాము ఎంతగానో అభిమానించేవారు దూరం కావడంతో మనస్థాపానికి గురవుతూ పలు అఘాయిత్యాలకు పాల్పపడుతున్నారు. కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటే.. మరికొంతమంది ఎదుటివారిపై దాడులకు పాల్పపడుతున్నారు.
ఇటీవల కొంతమంది యువత మద్యం, డ్రగ్స్ కి అలవాలు పడి రోడ్లపై ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిన్నారు.. కొన్ని సమయాల్లో ఎదుటివారిపై దాడులకు పాల్పపడుతున్నారు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో అప్పడప్పుడు దర్శనమిస్తుంటాయి. ఇలాంటి ఘటనే దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. ఓ యువకుడు పోలీసుల వద్ద గన్ లాక్కొని గాల్లోకి ఫైర్ చేస్తూ వీరంగం సృష్టించాడు. దీంతో అక్కడ ఉన్న జనం భయంతో పరుగులు తీశాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఢిల్లీలోని షహదారా ప్రాంతానికి చెందిన క్రిషన్ షేర్వాల్ (29) ని కొంతకాలం క్రితం భార్య వదిలివేసి వెళ్లిపోయింది. దాంతో మనస్థాపానికి గురైన క్రిషన్ వ్యసనాలకు అలవాటు పడ్డాడు. గురువారం సాయంత్రం నాథ కాలనీ చౌక్ వద్ద క్రిషన్ తన గొంతు కోసుకొని రక్తం కారుతుండగా కత్తితో రోడ్డుపై తిరుగుతూ నానా హంగామా సృష్టించారు. స్థానికులు భయంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అక్కడికి చేరుకున్నారు. కత్తితో గొంతు కోసుకొని తీరుగుతున్న క్రిషన్ ని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. దాంతో మరింత రెచ్చిపోయిన క్రిషన్ తన వద్దకు ఎవరూ రావొద్దని.. కత్తితో పొడచుకుని చనిపోతానని పోలీసులను బెదిరించాడు. అంతేకాదు అక్కడ ఓ పోలీస్ వద్ద గన్ లాక్కొని గాల్లోకి కాల్పులు చేస్తూ వీరంగం సృష్టించాడు.
రద్దీగా ఉన్న సమయంలో క్రిషన్ గన్ తో గాల్లోకి కాల్పులు జరుపుతూ హల్ చల్ చేశాడు. ఇక క్రిషన్ చేతిలో గన్ ఉండటంతో అక్కడ ఉన్న జనాలు భయంతో పరుగులు తీశారు. పోలీసుల వైపు గన్ తో కాల్పులు జరుపుతూ వెళ్లాడు. ఈ ఘటనలో పోలీసులకు స్వల్ప గాయాలు అయ్యాయి. అతి కష్టం మీద క్రిషన్ ని పోలీసులు పట్టుకొని అదుపులోకి తీసుకున్నారు. వెంటనే జీటీబీ హాస్పిటల్ లో చేర్పించి చికిత్స అందించారు. ఎంతో ఇష్టపడే భార్య దూరం కావడంతో డిప్రేషన్ లోకి వెళ్లిపోయిన క్రిషన్ షెర్వాల్ మనస్థాపంతో బాధపడుతున్నాడని పోలీసులు తెలిపారు. ఆత్మహత్యాయత్నం, పోలీసుల వద్ద గన్ లాక్కొని గాల్లో కాల్పులు జరిపిన సంఘటనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా క్రిషన్ చేసిన వీరంగానికి సంబంధించిన దృష్యాలు అక్కడ సీసీ టీవీలో రికార్డు అయ్యాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
#WATCH | Two PCR calls were received at 6:40 pm & 6:50 pm on 16 March at PS MS Park that a person, Krishan Sherwal had slit his throat with a knife & was running in public near Nathu Colony chowk with a knife & a pistol in his and also opened fire: Delhi Police
(CCTV visuals) pic.twitter.com/l9FyrlIcHd
— ANI (@ANI) March 17, 2023