దేశంలోని మహిళలపై అత్యాచారాలు, దాడులు ఆగడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలపై దాడులను అరికట్టేందుకు అనేక చట్టాలను తీసుకొచ్చాయి. నిర్భయ, దిశ వంటి ఘటనల్లో నిందితులకు కఠిన శిక్షలు పడినప్పటికీ మానవ మృగాల్లో ఎలాంటి మార్పు రావడం లేదు. ఇంకా నిత్యం ఏదో ఒక చోట మహిళలు, పిల్లలు, యువతులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవలే గుంటూరులో ఓ యువతిని బ్లేడ్ తో అతి కిరాతకంగా చంపిన సంగతి తెలిసిందే. అలానే హైదరాబాద్ లో ఓ యువతిని కిడ్నాప్ చేసి దాడి చేశారు. అనంతరం ఆమెను వదిలేసి పారిపోయారు. దేశ రాజధాని ఢిల్లీలో శ్రద్ధా వాకర్ హత్య దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. తాజాగా ఢిల్లీలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. తన చెల్లితో కలిసి నడుచుకుంటూ వెళ్తున్న ఓ యువతిపై ఇద్దరు వ్యక్తులు యాసిడ్ దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఢిల్లీలోని మొహన్ గార్డెన్ ప్రాంతంలో ఓ యువతి తన చెల్లితో కలిసి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంది. ఈ క్రమంలో వారికి ఎదురుగా ఇద్దరు వ్యక్తులు బైక్ పై వచ్చారు. ఆ అమ్మాయిలకు సమీపంలోకి రాగానే బైక్ పై వెనక కూర్చున వ్యక్తి యాసిడ్ తో యువతిపై దాడి చేశాడు. ఈ దాడిలో బాధితురాలికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు బాధితురాలిని వెంటనే సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలి నుంచి స్టేట్ మెంట్ తీసుకున్నారు. బాధితురాలు తనకు తెలిసిన కొందరు వ్యక్తులపై అనుమానం వ్యక్తం చేసింది. దీంతో వారిలో ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ యాసిడ్ ఘటనపై ఢిల్లీ మహిళ కమిషన్ ఛైర్ పర్సన్ స్వాతి మలివాల్ ట్వీట్ చేశారు. బాధితులకు వీలైనత త్వరగా న్యాయం జరిగేలా చూస్తామన్నారు.
ఈ ఘటనపై బాధితురాలి తండ్రి మాట్లాడుతూ..” నా కుమార్తెలు ఇద్దరు ఉదయం బయటకు వెళ్లారు. ఒక్కసారిగా ముసుగు ధరించిన ఇద్దరు వ్యక్తులు బైక్ పై వచ్చారు. తమ పెద్ద కుమార్తెపై యాసిడ్ దాడి చేసి అక్కడి నుంచి పారిపోయారు” అని తెలిపారు. అయితే ఈ ఘటనలపై పలు మహిళ సంఘాలు.. తమ నిరసన వ్యక్తం చేశాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులను కోరారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను వీలైనత త్వరగా పట్టుకుంటామని అన్నారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా చూస్తామని తెలిపారు. మహిళ రక్షణ కోసం ఎన్ని చట్టాలు వచ్చినా కూడా వారిపై దాడులు మాత్రం ఆగడం లేదని సంఘ సంస్కర్తలు అంటున్నారు. మరి.. దేశ రాజధానిలో యువతిపై జరిగిన యాసిడ్ దాడి ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Swati Maliwal (@SwatiJaiHind), chairperson, Delhi Commission for Women on acid attack on 17-year-old Delhi schoolgirl today pic.twitter.com/g2ge62RAez
— NDTV (@ndtv) December 14, 2022