అక్రమమార్గంలో సంపాదించే ధనం పాపమని తెలిసిన కూడా కొందరు అదే మార్గంలో వెళ్తుంటారు. డబ్బే ముఖ్యంగా అనేక రకాలైన అవినీతి పనులకు పాల్పడుతుంటారు. ఇలా చెడు మార్గంలో డబ్బులు సంపాదించే వారిలో పురుషులతో పాటు కొందరు మహిళలు కూడా ఉన్నారు. తమ అందం, మాటలతో మగాళ్లకు వలవేసి.. వారి నుంచి దొరికినంత దోచుకుంటారు. మరికొందరు ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియా ద్వారా యువకులకు గాలం వేసి లక్షల్లో డబ్బులు కాజేస్తుంటారు. తాజాగా ఓ కిలాడీ లేడి.. పెళ్లి కాని ఓ యువకుడ్ని ఫేస్ బుక్ ద్వారా పరిచయం చేసుకుని, మాయమాటలు చెప్పి లక్షల్లో డబ్బులు కాజేసింది. చివరకు తాను మోసపోయినట్లు తెలుసుకున్న యువకుడు పోలీసులుకు ఫిర్యాదు చేయడంతో ఆ మాయలాడి అసలు లీలలు బయటపడ్డాయి. ఈ ఘటన ఏపీలోని చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాకు చెందిన అపర్ణ అలియాస్ శ్వేత(29) అనే యువతి ఓ అనాథ ఆశ్రమంలో పని చేసేది. అయితే కొన్ని కారణాల వలన ఆ ఆశ్రమాన్ని మూసివేయడంతో శ్వేతకు ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. దీంతో ఆమె బుద్ధి వక్రమార్గంలోకి వెళ్లింది. డబ్బు సంపాదన కోసం శ్వేత అడ్డదారులు తొక్కింది. అలా అక్రమమార్గంలో డబ్బులు సంపాదించేందుకు ఫేస్ బుక్ ను మార్గంగా ఎంచుకుంది. దాని ద్వారా పరిచమైన వ్యక్తులను ట్రాప్ చేసి.. తన మాయమాటలతో వారిని డబ్బులు పంపమని కోరేది. ఈ విధంగా ఇప్పటికే లక్షల్లో డబ్బులు దోచుకుంది. ఈక్రమంలోనే రెండేళ్ల క్రితం హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తితో శ్వేత ఫేస్ బుక్ లో పరిచయం ఏర్పచుకుంది. వారిద్దరి ఫేస్ బుక్ పరిచయం కాస్తా ఫోన్ నెంబర్లు మార్చుకునే వరకు వెళ్లింది.
అలా ఈ ఇద్దరు ఫోన్ల ద్వారా తరచూ మాట్లాడుకునే వారు. ఈక్రమంలో ఇద్దరి మధ్య మాటల చనువు బాగా పెరిగింది. అతడ్ని ప్రేమిస్తున్నట్లు, పెళ్లి చేసుకుంటానని శ్వేత నమ్మించింది. ఇక త్వరలో ఇద్దరు భార్యాభర్తలం కాబోతున్నమని, అయితే డబ్బుల ఇబ్బంది ఉండకుండ చూసుకోవాలని ఆ యువకుడితో శ్వేత తెలిపింది. తన పేరు మీద రూ.7 కోట్ల బీమా ఉందని.. దీన్ని తీసుకుంటే ఇద్దరం సంతోషంగా ఉండొచ్చని తెలిపింది. అయితే ఆ డబ్బులు రావాలంటే.. ముందుగా కొంత మొత్తంలో తను చెల్లించాలని తెలిపింది. తన వద్ద డబ్బులు లేవని సాయం చేయాలని శ్వేత సదరు యువకుడిని కోరింది. శ్వేత మాటలు పూర్తిగా నమ్మిన ఆ వ్యక్తి విడతల వారిగా ఆమె అకౌంట్ కి రూ.46 లక్షలు జమ చేశాడు.
అయితే డబ్బులు తీసుకున్న తరువాత కూడా కొంతకాలం పాటు శ్వేత.. అతడితో మాట్లాడింది. అయితే ఆ యువకుడు.. తాను ఇచ్చిన డబ్బులు తిరిగి అడిగేసరికి.. శ్వేత ఫోన్ స్విఛాఫ్ చేసింది. ఆ యువకుడు ఎన్ని సార్లు ఫోన్ చేసిన ఆమె ఎత్తలేదు. దీంతో తాను మోసపోయినట్లు తెలుసుకున్న ఆ యువకుడు రాచకొండ సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. యువకుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి.. శ్వేతను పట్టుకున్నారు. ఆమె నుంచి 5 సెల్ ఫోన్లు , ఓ ట్యాబ్ ను స్వాధీనం చేసుకున్నారు. మరి.. మాయమాటలతో ఇలా ఎందరో యువకులను మోసం చేస్తున్నా ఇలాంటి కిలేడిలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.