ఈ మధ్యకాలంలో చాలామంది మనుషుల్లో ఆత్మవిశ్వాసం అనేది కనుమరుగై పోతుంది. జీవితంలో ఎదురయ్యే సమస్యలకు మానసికంగా కుంగిపోతుంటారు. అంతేకాక సమస్యల ఎదుర్కొనే ధైర్యం చేయకుండా దారుణమైన నిర్ణయాలు తీసుకుంటారు.
ఈ నేటికాలంలో చాలామంది మనుషుల్లో ఆత్మవిశ్వాసం అనేది కనుమరుగై పోతుంది. జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకు మానసికంగా కుంగిపోతుంటారు. అంతేకాక సమస్యల ఎదుర్కొనే ధైర్యం చేయకుండా దారుణమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆత్మహత్య ఒక్కటే తమ సమస్యలకు పరిష్కారంగా కొందరు భావిస్తుంటారు. ఇలా అనేక మంది తొందరపాటుతో నిండు జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్నారు. తాజాగా ఓ సచివాలయ ఉద్యోగిని కూడా అలాంటి నిర్ణయమే తీసుకుంది. మరికొద్ది రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఆమె ఉరితాడుకు వేలాడుతూ విగత జీవిగా కనిపించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
బాపట్ల జిల్లా కొల్లూరుకు చెందిన తోట సరళ(28).. వేమూరు సచివాలయంలో ఇంజినీరింగ్ అసిస్టెంటుగా పని చేస్తుంది. కొద్ది రోజుల క్రితమే ఆమెకు నిశ్చితార్ధం జరిగింది. మరికొద్ది రోజుల్లో పెళ్లి పీట ఎకాల్సిన తరుణంగా సరళ ఉరికి వేలాడుతు విగత జీవిగా కనిపించింది. గురువారం రాత్రి తన గదిలో నిద్రకు ఉపక్రమించిన ఆమె తెల్లవారిన తరువాత ఎంత సేపటికి బయటకు రాలేదు. ఎంత పిలిచినా పలకక పోవడంతో అనుమానం వచ్చిన ఆమె తండ్రి తలుపులు పగల కొట్టి చూడగా షాకింగ్ దృశ్యం కనిపించింది. గది శ్లాబుకు అమర్చిన ఇనుప కొక్కేనికి చీరతో ఉరి వేసుకుని కనిపించింది. కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే కిందకి దించి చూడగా అప్పటికే మృతి చెందినట్లు తేలింది. ఏడాది క్రితం కరోనా కారణం సరళ తల్లి మరణించింది. తల్లి మరణంతో సరళ మానసికంగా కుంగిపోయింది. దీనికి తోడుగా తరచూ తీవ్రంగా కడుపు నొప్పి బాధించేదంట. కడుపు నొప్పి తగ్గక పోవడంతో ఆ నొప్పిని భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.