ఈ భూ ప్రపంచంలో తల్లి ప్రేమకు సమానమైనది ఏమిలేదు. కారణం.. నవమోసాలు మోసి, కన్న బిడ్డను ఎంతో అల్లారు ముందుగా చూసుకుంటుంది. తన బిడ్డ భూమిపైకి వచ్చిన నాటి నుంచే కంటికి రెప్పలాగా కాపాడుకుంటుంది. బిడ్డ ఎలా ఉన్నా ప్రాణానికి ప్రాణంగా చూసుకునేది తల్లి మాత్రమే. కట్టుకున్న భర్త కాదు పొమ్మనా, నా అన్నకున్నవాళ్లు ఆదరించకపోయినా బిడ్డను పోషిస్తుంది. ఇంకా చెప్పాలంటే చివరకు తాను ఏకాకిగా మిగిలిన సరే.. సర్వం ధారపోసి బిడ్డను పెంచి పెద్ద చేస్తుంది. అలాంటి ఓ తల్లి.. కన్నపేగు బంధాన్ని మరచి.. నెలల పసికందుగా ఉన్న తన బిడ్డను గొంతు నులిమి చంపేసింది. అయితే ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటున్న ఆ తల్లి.. అంతటి దారుణ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు తెలిస్తే కన్నీళ్లు ఆగవు. ఈ ఘటన అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకుంది.
అన్నమయ్య జిల్లా పీలేరు పట్టణంలోని చెన్నారెడ్డి వీధికి చెందిన షేక్ మహమ్మద్ బాషా కు సంబేపల్లే మండలం చౌటపల్లె గ్రామమానికి చెందిన షేక్ ఫాతిమా అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి రుక్సానా అనే పదినెలల కుమార్తె ఉంది. అయితే ఫాతిమాకు అప్పుడప్పుడు మానసిక స్థితి సరిగ్గా ఉండేది కాదు. ఈక్రమంలో భర్తకు చెప్పకుండా పుట్టింటికి వెళ్తుండేది. అలానే ఆమె ఆరోగ్యంగా కూడా సరిగ్గా ఉండేది కాదు. దీంతో తన ఆరోగ్యం బాగాలేదని, త్వరలో చనిపోతానని భావించింది. అయితే తాను చనిపోతే.. తన బిడ్డ అనాథగా మారిపోతుందని, తన బిడ్డను ఎవరూ చూసుకోరని అనుమాన పడింది. తన బిడ్డకు కష్టాలు రాకూడదని ఆ మహిళ భావిచింది. అనుకున్నదే తడువుగా శనివారం తన పసిబిడ్డను తీసుకొని రాయచోటికి వచ్చింది. అక్కడ నుంచి పెమ్మాడపల్లె అనే గ్రామ సమీపంలో ఉన్న గుట్టలోకి తీసుకెళ్లి తన కుమార్తె గొంతు నులిమి చంపేసింది.
అనంతరం పాప మృతదేహాన్ని తన భుజాలపై వేసుకొని రాయచోటికి వచ్చింది. అనంతరం అక్కడి నుంచి తిరిగి పీలేరుకు వెళ్లింది. అప్పటికే రాత్రి కావడంతో ఫాతిమా బంధువులు.. ఆమెకోసం ఎదురు చూస్తున్నారు. ఇదే సమయంలో తన భర్త బంధువులకు ఫోన్ చేసి.. తన బిడ్డను చంపేశానని వచ్చి తీసుకెళ్లాలని చెప్పింది. ఆమె చెప్పిన మాటలకు అత్తింటి వారు ఒక్కసారిగా షాకయ్యారు. ఫాతిమా చెప్పిన ప్రాంతంకి వెళ్లి చూడగా పాప విగతజీవిగా పడి ఉంది. పాప మృతదేహాన్ని తీసుకొని రాయచోటి పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేశారు. నిందితురాల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. ఆమె మానసిక స్థితి సరిగ్గా లేక ఇలా చేసిందా? లేకా కావాలనే ఇలా చేసిందా? అనే విషయం తెలియాల్సి ఉంది. తాము చనిపోతే పిల్లలు అనాథలుగా మారుతారని తల్లు పాల్పడుతున్న ఇలాంటి అఘాయిత్యాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.