భార్యాభర్తల బంధంలో గొడవలు అనేవి సర్వసాధారణం. అలా చిన్నపాటి గొడవలు కూడా లేని జంటలు చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. అయితే దంపతుల మధ్య జరిగే గొడవలు పెద్దవిగా మారినప్పుడు అనేక అనర్థాలు చోటుచేసుకుంటాయి. ఒకరిపై మరొకరు దాడి చేసుకోవడం, లేకపోతే మనస్తాపంతో ఆత్మహత్యలు చేసుకోవడానికి వంటివి చేస్తుంటారు. దంపతుల మధ్య ఏర్పడిన కలహాల కారణంగా ఓ నిండు ప్రాణం బలైంది. అత్తగారింటికి తీసుకెళ్లేందుకు భర్త నిరాకరించాడని ఓ మహిళ మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం..
శ్రీకాకుళం జిల్లా కరవంజ పంచాయతీ పరిధిలోని మట్టవానిపేట అనే గ్రామానికి చెందిన మొసలిపల్లి నిర్మల(33), నందీశ్వరావు భార్యాభర్తలు. పాతపట్నం మండలం కొయ్యికొండ గ్రామానికి చెందిన నందీశ్వరతో నిర్మలకు ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. పెళ్లైన తరువాత చాలా కాలం పాటు ఈ దంపతుల సంసారం హాయిగా సాగింది. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే కొంతకాలం క్రితం నందీశ్వర్ రావు చెడు వ్యసనాలకు బానిసగా మారాడు. దీంతో ఈ దంపతుల మధ్య తరచు గొడవలు జరుగుతుండేవి. అలానే ఈ ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. భర్త నందీశ్వర్ రావుతో ఉండటం ఇష్టం లేని నిర్మల 2020లో పుట్టింటికి వెళ్లింది. ఇక అప్పటి నుంచి పుట్టింట్లోనే ఉంటుంది. అయిటే ఇటీవలే మళ్లీ భర్తతో నిర్మల ఫోన్ లో మాట్లాడటం ప్రారంభించింది.
ఇద్దరి మధ్య కాస్త గొడవలు సద్దుమణిగినట్లుగా స్థానికులు తెలిపారు. నిర్మల భర్తతో చరవాణిలో మాట్లాడే క్రమంలో తనను తీసుకెళ్లాలని అడిగింది. అయితే నిర్మలను తన ఇంటికి తెచ్చుకునేందుకు నందీశ్వర్ రావు నిరాకరించాడు. దీంతో మనస్తాపానికి గురైన నిర్మల ఆత్మహత్యకు పాల్పడింది. తల్లి మృతితో ఇద్దరు కుమార్తెలు ఒంటరిగా మిగిలిపోయారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చిన చావు పరిష్కారం కాదనే విషయం తెలిసినా.. కొందరు ఆత్మహత్యలకు పాల్పడటం దారుణం. ఇలా ఆత్మహత్యలు చేసుకోవడటంతో వారిని నమ్ముకున్న వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.