ఆ ఇద్దరూ ప్రేమించుకున్నారు.. పెద్దల అనుమతితో పెళ్లి చేసుకోవాల్సింది పోయి వారి ఇష్టానికి వ్యతిరేకంగా సహజీవనం మొదలుపెట్టారు. ఆ సహజీవనం కాస్తా మూడు రోజుల ముచ్చటగా మారింది. ప్రియుడు చేసిన పనికి ఆ యువతి భయపడిపోయి చివరకు పోలీసులను ఆశ్రయించింది. ఈ సంఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అహ్మదాబాద్, నరోడా ప్రాంతానికి చెందిన 21 ఏళ్ల తేజల్ థాకొరే అదే ప్రాంతానికి చెందిన అజయ్ థాకొరేతో ప్రేమలో పడింది.
పెద్దల ఇష్టానికి వ్యతిరేకంగా వీరు గత కొన్ని నెలలుగా ఓ ఇంట్లో సహజీవనం చేస్తున్నారు. గత సోమవారం అర్థరాత్రి అజయ్ ఇంటికి వచ్చాడు. తనకు భోజనం కావాలని అడిగాడు. అయితే, తాను ఏ వంట చేయలేదని ఆమె చెప్పింది. దీంతో అతడికి కోపం వచ్చింది. ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. దీంతో మరింత కోపానికి గురైన అజయ్ ఆమెను దుపట్టాతో కట్టేసి చితక బాదాడు.
అంతేకాదు! గదిలోని టేబుల్ ప్యాన్‌తో కూడా ఆమెను కొట్టాడు. ఈ విషయం పోలీసులకు చెబితే చంపేస్తానని బెదిరించి అక్కడినుంచి వెళ్లిపోయాడు. అతడు వెళ్లిపోయిన కొద్దిసేపటికి తేజల్ తన ఇంటికి వెళ్లిపోయింది. అక్కడినుంచి ఆసుపత్రి వెళ్లి చికిత్స చేయించుకుంది. ఆ తర్వాత పోలీస్ స్టేషన్‌కు వెళ్లి అజయ్‌పై ఫిర్యాదు చేసింది. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయగలరు.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.