నేటి సమాజంలోని మనిషిలో ఆత్మవిశ్వాసం అనేది కొరవడింది. జీవితంలో ఎదురయ్యే సమస్యలకు భయపడి మానసికంగా కుంగిపోతున్నారు. మానసిక ఒత్తిడిని తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడుతున్నారు. తాజాగా ఓ మహిళ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకుంది.
నేటికాలంలో మనిషిలో ఆత్మవిశ్వాసం అనేది కొరవడింది. జీవితంలో ఎదురయ్యే సమస్యలకు భయపడి మానసికంగా కుంగిపోతున్నారు. కొందరు అయితే మరీ దారుణంగా ఆలోచిస్తున్నారు. తమ సమస్యలకు చావే పరిష్కారంగా భావిస్తుంటారు. ఇంకా దారుణం ఏమిటంటే చదువుకుని, మంచి ఉద్యోగం చేస్తున్న వాళ్లు కూడా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఎంతో మంది ప్రముఖులు సైతం మానసిక ఒత్తిడికి తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడుతుంటారు. తాజాగా ఓ మహిళ కానిస్టేబులు ఆత్మహత్య చేసుకుంది. అయితే ఆమెను భర్తే చంపి ఆత్మహత్యగా చిత్రీకరించినట్లు మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
వరంగల్ లోని బ్యాంక్ కాలనీలో మౌనిక అనే మహిళ కానిస్టేబుల్ నివాసం ఉంటుంది. ఆమె మహబూబాబాద్ లో రైటర్ గా విధులు నిర్వహిస్తుంది. గతంలో కాజీపేట ఏసీపీ ఆఫీస్ లో నాలుగేళ్లు పనిచేసింది. కొన్నేళ్ల క్రితమే మహబూబాబాద్ లో రైటర్ గా విధుల్లోకి వచ్చారు. ఈక్రమంలో బ్యాంక్ కాలనీలోని తన నివాసంలో ఉరివేసుకుని కానిస్టేబుల్ మౌనిక ఆత్మహత్య చేసుకుంది. అయితే.. ఇంట్లో వేధింపులు తాళలేక మౌనిక ఆత్మహత్య చేసుకున్నట్టు ఆరోపణలు వినిపిస్తోన్నాయి. అలానే కానిస్టేబుల్ మౌనిక మృతిపై కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. భర్త హత్య చేసి ఉరి వేసుకున్నట్లు సృష్టిస్తున్నాడని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
బంధువుల ఫిర్యాదుతో మట్టవాడ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని ఎంజీఎం ఆస్పత్రిలోని మార్చురికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఇప్పటికే పలువురు కానిస్టేబుల్ ఒత్తిడి కారణంగా ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అలానే మరికొందరు అనుమానస్పద స్థితి మృతి చెందారు. తాజాగా కానిస్టేబుల్ మౌనిక విషయంలో ఏం జరిగిందనేది తెలియాల్సి ఉంది. మరి.. ఇలాంటి ఘటనల నిర్మూలనకు మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.