జీవితం అంటే కష్టసుఖాలతో సాగే ఓ ప్రయాణం. అయితే ఎంతో మంది తమ జీవితంలో ఎదురయ్యే సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు సాగుతుంటారు. మరికొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తాజాగా ఓ మహిళ చేసిన పని ఇద్దరు పిల్లలను అనాథలను చేసింది.
జీవితం అంటే కష్టసుఖాలతో సాగే ఓ ప్రయాణం. అయితే ఎంతో మంది తమ జీవితంలో ఎదురయ్యే సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు సాగుతుంటారు. మరికొందరు ఆత్మహత్యలు చేసుకుంటూ.. నిండు జీవితాన్ని బలి చేసుకుంటున్నారు. ముఖ్యంగా కొందరు మహిళలు ఇంట్లో వచ్చే సమస్యలకు, కష్టాలతు తీవ్రంగా కుంగిపోతుంటారు. ఇలా కష్టాలతో బతకడం వృథా అంటూ దారుణమైన నిర్ణయాలు తీసుకుంటారు. తాజాగా ఓ మహిళ.. అత్తింటి వారు వేధిస్తున్నారని ఆత్మహత్యకు పాల్పడింది. ఈఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళ్తే..
విజయనగరం జిల్లా గంట్యాడ మండలం రాకోడు గ్రామానికి రమకు లక్కవరపు కోట మండలం మార్లాపల్లి గ్రామానికి చెందిన చిన్నం నాయుడుతో ఆరెళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఐదేళ్ల పాప, మూడేళ్ల బాబు ఉన్నాడు. చిన్నం నాయుడు విశాఖలోని ఓ కంపెనిలో ఉద్యోగం చేస్తున్నాడని సమాచారం. శనివారం కూడా చిన్నం నాయుడు ఉద్యోగ నిమిత్తం విశాఖ వెళ్లాడు. ఆ రోజు రాత్రి రమ ఒక్కతే ఇంట్లో పడుకుంది. ఆదివారం ఉదయం రమ ఉరికి వేలాడుతూ కనిపించింది. వెంటనే స్థానికులు ఎల్.కోట పోలీసులకు సమాచారం ఇచ్చారు.
దీంతో ఎస్సై ముకుందరావు సిబ్బందితో కలిసి ఘటన స్థలానికి వచ్చి పరిశీలించారు. అలానే మృతురాలి తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో వారు.. ఘటన స్థలానికి చేరుకున్నారు. కుమార్తె మృతదేహాన్ని చూసి భోరున విలపించారు. తన కుమార్తె చావుకు అల్లుడు, అత్తమామల వేధింపులే కారణమని మృతరాలి తండ్రి రామకృష్ణ ఆరోపించాడు. తన కూతుర్ని శారీరకంగా హింసించడంతో పాటు అల్లుడికి మరో మహిళతో వివాహేతర సంబంధం ఉండదని, మనస్తాపానికి గురై.. ఆత్మహత్యకు పాల్పడిన మృతురాలి తండ్రి తెలిపాడు. రమ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.