ఈ భూమి మీద అమ్మ ప్రేమకు సమానమైనది మరేది ఉండదు. తన బిడ్డలకు ఏ చిన్న కష్టం వచ్చిన అల్లాడిపోతుంది. ఎంతో అపురూపంగా పిల్లలను పెంచి.. పెద్ద చేస్తుంది. వారికోసం ఎన్నెన్నో త్యాగాలను కూడా చేస్తుంది. పెళ్లి వయసుకు వచ్చిన కూడా వారు.. ఆ తల్లికి చిన్నపిల్లలే. ఇంక చెప్పాలంటే బిడ్డల ప్రాణాల కోసం తమ ప్రాణాలు అడ్డు వేస్తారు మాతృమూర్తులు. అలాంటి ఓ తల్లి.. తన చేతులతోనే కొడుకుకి విషం మిచ్చి చంపింది. తాగుడకు బానిసై నిత్యం హింసించే ఆ కుమారుడి వేధింపులు తట్టుకోలేక, సహనం చచ్చిన ఆ తల్లి విషమిచ్చి చంపేసింది. ఈ ఘట విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది.
విజయనగరం జిల్లా పూసపాటి రేగ మండలం గుండపు రెడ్డి పాలెంలో గొడ్డు రామాయమ్మ, తన కుమార్తె, కుమారుడి సాయి(20)తో కలిసి జీవనం సాగిస్తోంది. మూడేళ్ల కిందట భర్త చనిపోయారు. ఆమె స్థానికంగా ఉన్న ఓ ఫార్మా కంపెనీలో పనిచేస్తూ కుటుంబాన్ని షోషింస్తోంది. కొడుకు చెడు వ్యసనాలకు బానిసై నిత్యం మద్యం తాగి ఇంటి వచ్చేవాడు. ఈక్రమంలో ఆమె కొడుకు మూడు నెలల క్రితం ఫుల్లుగా తాగి వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అతడి రెండు కాళ్లు విరిగిపోయి మంచానికి పరిమితం అయ్యాడు. అయినా అతడికి సేవలు చేస్తూ తల్లి కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. అయితే రోజూ మాంసం వండాలని, మద్యం తీసుకురావాలని తల్లిని, అక్కని సాయి వేధించి.. కొట్టేవాడు. కొన్ని రోజుల పాటు కుమారుడి వేధింపులు భరిస్తూ వచ్చింది ఆ తల్లి.
ఇక కుమారుడి ఆగడాలను భరించలేని రామాయమ్మ శుక్రవారం రాత్రి సాయి(20)కి అన్నంలో పురుగుల మందు కలిపి వడ్డించింది. అది తిన్న సాయి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. కానీ కుమారుడిని ఆస్థితిలో చూసి తట్టుకోలేక ఆ తల్లే స్వయంగా అంబులెన్స్ కు సమాచారం అందించింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం సాయి చనిపోయాడు. ఈ మృతిపై సోదరి సునీత అనుమానాలు వ్యక్తం చేయగా… తల్లిని విచారించారు. అయితే వేధింపులు తాళలేక, అతడి అడిగింది ఇవ్వలేకే అన్నంలో పురుగుల మందు కలిపినట్లు ఆమె ఆంగీకరించారు. మరి.. ఈఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.