భార్యాభర్తల మధ్య గొడవలు అనేది సర్వసాధారణం. ఈ మధ్యకాలంలో ఈ గొడవలు చిలికి చిలికి గాలివానా తుపాన్ లా మారినట్లు పెద్ద ఘర్షణకు దారి తీస్తున్నాయి. అలానే గొడవల కారణంగా దారుణమైన ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.
భార్యాభర్తల మధ్య గొడవలు జరగడం అనేది సర్వసాధారణం. గొడవలు జరగని సంసారాలు అంటూ చాలా తక్కువ ఉంటాయి. మన పెద్దల కాలంలో కూడా భార్యాభర్తలు గొడవలు పడి.. కాసేపటి తరువాత యథాస్థితికి వచ్చేస్తారు. ఇలా సర్థుకుపోతూ ఇద్దరూ సంసార జీవితంలో కలసి నడుస్తారు. అయితే ఈ మధ్యకాలంలో దంపతుల మధ్య జరుగుతున్న గొడవలు పెద్దవిగా మారుతున్నాయి. ఇద్దరూ పంతాలకు పోయే.. చిన్నపాటి గొడవలను కూడా పెద్దవిగా చేసుకుంటున్నారు. ఈ క్రమంలో భాగస్వామిలో ఎవరో ఒకరు క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకోవడం లేదా హత్య చేయడం వంటివి చేస్తున్నారు. తాజాగా అలాంటి ఘటనే విశాఖపట్నంలో చోటుచేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న దంపతుల మధ్య జరిగిన చిన్నపాటి గొడవ.. ఒక ప్రాణాన్ని బలి తీసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ఒడిశా రాష్ట్రాం గంజాం జిల్లా పులసారా గ్రామానికి చెందిన బెహరా శ్రీకాంత్, బెహరా కొకెన్(21) ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన తరువాత కూడా చాలా కాలం సొంత ఊరిలోనే పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. రెండేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం విశాఖపట్నం జిల్లా పెదగంట్యాడ ప్రాంతానికి వచ్చారు. వీరిద్దరికి ఓ కుమార్తె ఉంది. బెహరా శ్రీకాంత్ స్థానికంగా ఉండే ఓ ప్రైవేటు ప్లాస్టిక్ కంపెనీలో పని చేస్తున్నారు. చాలా కాలం పాటు ఈ దంపతులు ఇద్దరు ఎంతో సంతోషంగా ఉన్నారు. అయితే గత కొంతకాలం నుంచి ఈ దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం కూడా మరోసారి శ్రీకాంత్, కొకెన్ మధ్య గొడవ జరిగింది. ఆ తరువాత ఇంట్లోనే చేరొక ప్రాంతంలో నిద్రపోగా.. అర్థరాత్రి సమయంలో కొకెన్ మరుగుదొడ్లోకి వెళ్లి చున్నీతో ఉరేసుకుంది.
కొకెన్ ఉరేసుకున్న విషయాన్ని గుర్తించిన ఆమె భర్త ఇరుగు పొరుగు వారికి సమాచారం ఇచ్చాడు. అనంతరం పోలీసులకు, మృతురాలి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మంగళవారం న్యూపోర్టు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిసరాలను పరిశీలించారు. అలానే మృతురాలి ఇంటికి సమీపంలో ఉండే వారి నుంచి వివరాలు సేకరించారు. ఆమె మృతిపై ఇతర కోణాల్లోనూ పోలీసులు ఆరా తీస్తున్నారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం కేజీహెచ్ ఆస్పత్రికి తరలించారు. తల్లి మృతితో ఆ చిన్నారి అనాథగా మిగిలిపోయింది. కొకెన్ మృతితో ఆమె ఇంట తీవ్ర విషాదం నెలకొంది. మరి.. క్షణి కావేశంలో ఇలాంటి దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్న వ్యక్తులపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.