నర రూప రాక్షసులు అనగానే మనందరికి భయం వేస్తోంది. ఎందుకంటే మనషుల్ని బతింకుండానే పీక్కుతిని రక్తాన్ని తాగేస్తారు. అందుకే.. ఆ పేరు వినగానే ఒళ్లంతా జలదరిచ్చి.. ఓ గగుర్పాటుకు గురువుతాము. అయితే ఇలాంటీ ఎక్కడ ఎప్పుడు జరిగాయని మనం విన్నాము. అయితే ఈ రోజుల్లో కూడా అలాంటి వారు ఉంటారా? అనేది మనం ఊహించలేము. అయితే ఓ మహిళను చూసిన తరువాత.. నరరూప రాక్షసులు ఈ రోజుల్లో కూడా ఉన్నారు అనే భావన తప్పక కలుగుతుంది. ఆ మహిళ నరరూప రాక్షసుల కన్నా క్రూరంగా వ్యవహరించింది. తన తమ్ముడి కూతురిని చంపి ఆ తర్వాత రక్తం తాగేసింది. ఈ దారుణమైన ఘటన విశాఖలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
విశాఖపట్నంలోని పెదబయలు మండలం లకేయపుట్టు గ్రామానికి చెందిన వంతాల రస్మో అనే మహిళకు పెళ్లయింది. అయితే రస్మోకి తన భర్తతో కొన్ని సంవత్సరాల క్రితం గొడవలు జరగడంతో.. పుట్టింటికి వచ్చింది. ఈక్రమంలో భర్త దగ్గరకు వెళ్లకుండా పుట్టింట్లోనే ఉంటోంది. దీంతో పుట్టింటి వారు ఎంత చెప్పిన అత్తింటికి వెళ్లడం లేదు. ఆ మహిళ తమ్ముడి, అతడి భార్య..ఇక్కడ ఉండకూడదు భర్త దగ్గరకు వెళ్లాలని నచ్చజెప్పారు. అయినప్పటికి వెళ్లకపోవడంతో ఆమె అత్తింటికి వెళ్లాలని గట్టిగా హెచ్చారించారు. ఈ క్రమంలో తమ్ముడు చనిపోయాడు. అతడికి ఆరేళ్ల పాప ఉంది. మరోసారి తమ్ముడి భార్యతో రస్మోకి గోడవ జరిగింది.
దీంతో దాంతో తమ్ముడి భార్యపై రస్మో కక్ష పెంచుకుంది. ఆ కోపంతో తమ్ముడి కూతురిపై చూపించాలని అనుకుంది. కట్టెలు తీసుకొద్దాము.. అంటూ రస్మో ఆరేళ్ల పాపను తన వెంటపెట్టుకుని వెళ్లింది. కొండపైకి చేరుకున్న తర్వాత కట్టెలు కొట్టే గొడ్డలితో అతి కిరాతకంగా నరికేసి.. ఆ తర్వాత మేన కోడలి రక్తాన్ని జుర్రుకుని తాగింది.ఈ ఘటన చూసి ఒక్కసారిగా ఉలికిపాటుకు గురయ్యారు. ఘటనా స్థలంలో రక్తపు మడుగుల్లో ఉన్న చిన్నారి మృతదేహం, ఒళ్లంతా రక్తంతో ఉన్న రస్మోని చూసి పోలీసులు కూడా గగుర్పాటుకు గురయ్యారు.
చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం తరలించిన పోలీసులు.. రస్మోని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఆటవిక సమాజంలో చూసే ఘటనను ఇలా ప్రత్యక్షంగా చూడటంతో గ్రామస్థులు కూడా ఒణికిపోతున్నారు. రస్మో తీరును చూసిన ప్రతి ఒక్కరూ భయబ్రాంతులకు గురవుతున్నారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.